మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ కావడం. ప్యాన్ ఇండియా కాకపోయినా వాయిదాల ప్రవాహంలో తడిసిపోతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ అక్టోబర్ తొమ్మిది డేట్ వదులుకోడం దగ్గుబాటి అభిమానులను బాధించింది. పోనీ ఒక వారం ఆలస్యంగా వస్తుందేమో అనుకుంటే ఏకంగా అక్టోబర్ 30కి వెళ్తున్నారనే తాజా ప్రచారం ఆందోళన ఆనందం రెండు కలిగిస్తోంది.
నిజానికి ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నవంబర్ మొదటి వారంలో రామాయణ లాంటి విజువల్ గ్రాండియర్స్ ఉన్నాయి కాబట్టి ఓవర్సీస్ లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందే వచ్చేయడం సేఫ్. మూడు నెలలు తిరగకుండానే వెంకటేష్ మరో సినిమా జనవరి 12 విడుదల సంక్రాంతి థియేటర్లలో ఉంటుంది. ఇంత తక్కువ గ్యాప్ లో వెంకటేష్ లాంటి సీనియర్ హీరో రెండుసార్లు రావడమనేది అభిమానులకు హ్యాపీనే కానీ మార్కెట్ కోణంలో అంత రైట్ కాదనేది ట్రేడ్ టాక్.
ఇక్కడ చిరంజీవికి ఇదే సమస్య ఉంది. జనవరి పదమూడు కాకా దిగుతాడు. దానికి ముందో వెనుకో కేవలం రెండు నెలల స్పేస్ లో విశ్వంభర వచ్చేయాలి. ఓటిటి డీల్ దానికి తగినట్టే జరగడంతో వేరే ఆప్షన్ లేదు. అనిల్ రావిపూడి, బాబీ కొల్లిలు కనక పట్టుదలగా లేకపోతే ఆదర్శ కుటుంబం, విశ్వంభర రెండూ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉండేది. కానీ వాళ్ళు ముందు నుంచి ప్లానింగ్ లో ఉండటం వల్ల చిరు వెంకీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి నెలకొంది. అందుకే ఈ తిప్పలు.
సరైన ప్లానింగ్ లేకపోతే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. స్టార్ కావొచ్చు లేదా అప్ కమింగ్ హీరో కావచ్చు ఎవరైనా ఇది ఫేస్ చేయాల్సిందే. అసలు ఇలాంటి స్పీడే థియేటర్ వ్యవస్థ కోరుకునేది. కాకపోతే వేగంగా రెగ్యులర్ గా పెద్ద సినిమాలు వస్తూ ఉంటే హాళ్లు నిండుగా కళకళలాడుతూ ఉపాధి అవకాశాలు పెంచుతాయి. అయితే అతివృష్టి లేదా అనావృష్టి లాగా ఇలా మెరుపుదాడి చేయడం లేదంటే నెలలు సంవత్సరాల తరబడి సినిమాలు ఇవ్వకపోవడం సరికాదని బయ్యర్ వర్గాల మాట.
This post was last modified on October 7, 2026 11:09 am
ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…
స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…
ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…