Movie News

RRR మల్లీ… ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 2022లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. అలాగే కథను పూర్తిగా మలుపు తిప్పే కీలకమైన పాత్రలో నటించిన చిన్నారి మల్లీ క్యారెక్టర్ ప్రేక్షకులకు ఇంకా బలంగా గుర్తుండే ఉంటుంది.

ఆ క్యూట్ చిన్నారి అసలు పేరు ట్వింకిల్ శర్మ. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందు ఈమె పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా బుల్లితెరపై సందడి చేస్తూ బిజీగా ఉండేది. యాడ్స్ లో ట్వింకిల్ శర్మ క్యూట్ నెస్ చూసిన రాజమౌళి ఆమెను మల్లీ పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నారు. అలా ఆ సినిమాలో గిరిజన బాలికగా తన అద్భుతమైన అమాయకపు నటనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ సినిమాలో అమాయకంగా కనిపించిన మల్లీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. గడిచిన ఈ నాలుగేళ్ల వ్యవధిలో ఆమె లుక్స్ లో ఎవరూ ఊహించని రేంజ్ లో మార్పులు వచ్చాయి. మొన్నటివరకు చూడటానికి చాలా క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు యంగ్ బ్యూటీగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ట్వింకిల్ శర్మ తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలతో నెట్టింట సెన్సేషన్ గా మారింది.

లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసిన పిక్స్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోల్లో ఉన్న బ్లాక్ స్లీవ్ లెస్ టాప్, దానికి తోడు డెనిమ్ షార్ట్ స్కర్ట్ లో దర్శనమిచ్చింది. ఒకప్పటి ఆ క్యూట్ నెస్ పోయి ఇప్పుడు అచ్చం ఒక సినిమా హీరోయిన్ లాగా చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఇంత స్టైలిష్ గా ఆమెను చూసిన నెటిజన్లు అసలు గుర్తుపట్టలేకపోతున్నారు.

మొన్నటి వరకు చిన్న పిల్లలా ఉన్న ట్వింకిల్ శర్మ అప్పుడే ఇంతలా ఎదిగిపోయిందా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మోడ్రన్ డ్రెస్సుల్లో ఆమె ఇస్తున్న హాట్ ఫోజులు చూస్తుంటే ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కామెంట్స్ పెడుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెడుతున్న లేటెస్ట్ ఫోటోషూట్స్ అన్నీ ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతూ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి.

చిన్న వయసులోనే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించడం ఆమె కెరీర్ కు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దానికి తోడు ఇప్పుడు గ్లామర్ గర్ల్ గా కూడా హైలెట్ అవుతోంది కాబట్టి ఆమెకు త్వరలోనే మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో ట్వింకిల్ శర్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి మెయిన్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

This post was last modified on June 18, 2026 2:34 pm

Page: 1 2

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

60 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

1 hour ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

1 hour ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

2 hours ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

3 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

4 hours ago