Movie News

సమంత పేరు మార్మోగుతోంది

ఈ రోజుల్లో మిడ్ రేంజ్ స్టార్ల సినిమాలకు కూడా జనం థియేటర్లకు కష్టమైపోతోంది. ప్రోమోలు చాలా ఆకర్షణీయంగా ఉండి, మంచి బజ్ క్రియేట్ అయితే తప్ప జనం థియేటర్లకు కదలట్లేదు. అందులోనూ ఈ ఏడాది సంక్రాంతి తర్వాత టాలీవుడ్ ఎలాంటి స్లంప్‌ను చూసిందో తెలిసిందే. కనీస ఓపెనింగ్స్ లేక ఎన్నో సినిమాలు దారుణమైన ఫలితాలందుకున్నాయి. వేసవి మొత్తం వెలవెలబోయింది.

కానీ సీజన్ చివర్లో ‘పెద్ది’ సినిమాతో బాక్సాఫీస్‌కు మళ్లీ జోష్ వచ్చింది. ఆ వెంటనే ‘సింగ్ గీతం’ సైతం మంచి స్పందనే తెచ్చుకుంది. ఈ ఊపును కొనసాగిస్తూ ఈ వారం రిలీజ్ కానున్న సమంత సినిమా ‘మా ఇంటి బంగారం’ కూడా ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది.ఈ వీక్ ఇంకో నాలుగైదు సినిమాలు రిలీజవుతున్నప్పటికీ.. ఫోకస్ అంతా కూడా సామ్ సినిమా మీదే ఉంది. దీనికి మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి.

‘మా ఇంటి బంగారం’ చిత్రానికి కూడా ఒక దశ వరకు అంతగా హైప్ కనిపించలేదు. కానీ రిలీజ్ ముంగిట పరిస్థితులు వేగంగా మారిపోయాయి. థియేట్రికల్ ట్రైలర్ క్లిక్ అయింది. సమంత అండ్ టీం చేసిన ప్రమోషన్లూ కలిసి వచ్చాయి. సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయి.. జనం బాగానే టికెట్లు కొంటున్నారు. శుక్రవారం ఉదయం ఈ చిత్రానికి చాలా షోలు ఫుల్స్ పడితే ఆశ్చర్యం లేదు. ఈ సినిమాను సమంత తన స్టార్ పవర్‌తోనే కాక ప్రమోషన్ల పరంగానూ పుష్ చేస్తున్న తీరు ప్రశంసనీయం.

ఒక్క రోజులో ఆమె ఏకంగా 40 ఇంటర్వ్యూలివ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఎంత ఓపిక ఉన్న వాళ్లయినా ఓ పది ఇంటర్వ్యూలిస్తే అలసిపోతారు. విసుగెత్తిపోతారు. కానీ ఒక్క రోజులో 40 ఇంటర్వ్యూలంటే సామాన్యమైన విషయం కాదు. ఇది సమంత ఓపికకు, కమిట్మెంట్‌కు నిదర్శనం. ‘మా ఇంటి బంగారం’ అంచనాలకు తగ్గట్లు ఉంటే.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సమంతకు హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం ఖాయం. అదే జరిగితే సమంత తన కెరీర్‌ను ఇంకొన్నేళ్లు పొడిగించుకున్నట్లే.

This post was last modified on June 18, 2026 2:25 pm

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

48 minutes ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

8 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

9 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

9 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

9 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

10 hours ago