గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి ఆడతాయా లేదానే లెక్కలు వేసుకోకుండా గుడ్డిగా థియేటర్లలో వదులుతున్నారు. కనీసం డిజిటల్ ఖర్చులు రానంత దీనంగా కొన్ని చేతులు ఎత్తేస్తుంటే కొన్ని మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు ఇస్తున్నాయి. వాటి పేర్లు చరిత్ర ఇప్పుడు అవసరం లేదు కానీ ఒక ఆల్ టైం క్లాసిక్ వచ్చే సందర్భాన్ని మాత్రం ఖచ్చితంగా సెలెబ్రేట్ చేసుకోవాలి. అదే గీతాంజలి.
1989లో మాస్ హీరోగా ఎదిగేందుకు నాగార్జున ప్రయత్నిస్తున్న టైంలో మణిరత్నం వచ్చి జబ్బు పడ్డ హీరో హీరోయిన్ కథ చెప్పారు. అంతటి కల్ట్ దర్శకుడు తెలుగులో సినిమా తీయడం, అది కూడా తనతో అనగానే నాగ్ ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా ఓకే చెప్పారు. నాయకుడు, ఘర్షణ, మౌనరాగం లాంటి సూపర్ హిట్స్ తో తెలుగులోనూ మణిరత్నంకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే గీతాంజలి అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.
మళ్ళీ వినాలనిపించే ఇళయరాజా అద్భుతమైన పాటలు, పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం, సహజమైన నటీనటులు పెర్ఫార్మన్స్, ఊటిలో తీసిన అందమైన విజువల్స్, నాగ్ గిరిజ నటన వెరసి గీతాంజలి మాయలో ఆడియన్స్ మునిగి తేలారు. నిజానికి గీతాంజలి మొదటి వారంలో నెగటివ్ టాక్ వచ్చింది. ఫైట్లు, పెద్దగా డైలాగులు లేని ఇలాంటి స్టోరీని తొలి వారంలో పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. తర్వాత టాక్ మారిపోయింది. అలా అలా వంద రోజులకు పరుగులు పెట్టింది.
ఇప్పుడీ గీతాంజలిని ఆగస్ట్ 28 మళ్ళీ థియేటర్లకు తీసుకొస్తున్నారు. దశాబ్దాల తర్వాత దీన్ని మళ్ళీ వెండితెర మీద చూసే ఛాన్స్ మూవీ లవర్స్ దక్కించుకున్నారు. మణిరత్నం, ఇళయరాజా మేజిక్ అర్థం కావాలంటే బిగ్ స్క్రీన్ లోనే చూడాలి. అందుకే ఇది రికమండెడ్ క్యాటగిరీలోకి వస్తుంది. ఆగస్ట్ 29 నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగా రీ రిలీజ్ చేస్తున్నారు. శివ, జగదేకవీరుడు అతిలోకసుందరిలాగా ఇది కూడా మంచి స్పందన దక్కించుకునే అవకాశముంది.
This post was last modified on June 17, 2026 9:34 pm
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…