Movie News

హీరో, మాజీ భార్య‌లు, కాబోయే భార్య‌.. కలిసి ప్రయాణం

సెల‌బ్రెటీల్లో అయినా.. సామాన్యుల్లో అయినా..ఒక‌సారి విడాకులు అయ్యాక త‌మ మాజీ భాగ‌స్వాముల‌తో క‌ల‌వ‌డానికి అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వారి గురించి మాట్లాడ‌డానికి కూడా ఆస‌క్తి చూపించరు. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం అందుకు భిన్నం. ఆయ‌నకు ఇప్ప‌టికే రెండుసార్లు పెళ్లి జ‌రిగి, విడాకులు అయిన సంగ‌తి తెలిసిందే. ముందుగా రీనా ద‌త్తాను 1986లో పెళ్లాడి 2002లో ఆమె నుంచి విడిపోయారు. త‌ర్వాత 2005లో కిర‌ణ్ రావును పెళ్లి చేసుకుని 2021లో ఆమె నుంచి కూడా విడాకులు తీసుకున్నారు.

ఇప్పుడేమో గౌరీ స్ప్రాట్ అనే బెంగ‌ళూరు మ‌హిళ‌తో ఆయ‌న పెళ్లికి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. కొన్నేళ్లుగా గౌరీతో ఆయ‌న రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారు. ఐతే రీనా, కిర‌ణ్‌ల నుంచి విడిపోయినా స‌రే.. వారితో ఆయ‌న‌కు మంచి సంబంధాలున్నాయి. త‌ర‌చుగా వాళ్ల‌ను క‌లుస్తుంటారు. కిర‌ణ్ నుంచి విడిపోయాక కూడా ఆమెతో క‌లిసి సినిమాల కోసం ప‌ని చేశాడు ఆమిర్.

ఇదంతా ఒకెత్త‌య‌తే.. ఇప్పుడు ఆమిర్ త‌న మాజీ భార్య‌లు, కాబోయే భార్య‌తో క‌లిసి ఒకే కార్లో ప్ర‌యాణించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. సంద‌ర్భం ఏంట‌న్న‌ది స్ప‌ష్ట‌త లేదు కానీ.. కార్లో ముందు ఆమిర్, వెనుక గౌరీ కూర్చుని ఉండ‌గా.. కిర‌ణ్ రావు, రీనా ద‌త్తా సైతం అదే కారు ఎక్క‌డం మీడియా కెమెరాల్లో రికార్డ్ అయింది.

ఈ అరుదైన దృశ్యం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ‌సుదైక కుటుంబం అంటే ఇదే అని.. వివాహ బంధం విఫ‌ల‌మైనంత మాత్రాన సంబంధాల‌ను పూర్తిగా తెంచుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఇలా అంద‌రూ అర్థః చేసుకుని, స‌న్నిహితంగా మెల‌గ‌డం మంచి విష‌య‌మే అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

విశేషం ఏంటంటే.. త్వ‌ర‌లో జ‌రిగే ఆమిర్, గౌరీల పెళ్లికి కిర‌ణ్‌, రీనా కూడా హాజ‌ర‌వుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అదే జ‌రిగితే ఆ దృశ్యాలు మ‌రింత‌గా సోష‌ల్ మీడియా దృష్టిని ఆక‌ర్షించ‌డం ఖాయం. ఇక కెరీర్ విష‌యానికి వ‌స్తే గ‌త ఏడాది సితారే జ‌మీన్ ప‌ర్ చిత్రంతో ప‌ల‌క‌రించిన ఆమిర్.. ప్ర‌స్తుతం త్రీ ఇడియ‌ట్స్ సీక్వెల్ స‌న్నాహాల్లో ఉన్న‌ట్లు వార్తుల వ‌స్తున్నాయి. ఈ చిత్రం కోసం రాజ్ కుమార్ హిరానితో క‌లిసి ఆయ‌న ప‌ని చేయ‌బోతున్నారు.

This post was last modified on June 18, 2026 12:23 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago