Movie News

సోషల్ మీడియాకి రియాక్ట్ అయితే ఎలా

సెలబ్రిటీలు సోషల్ మీడియాకు స్పందించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం టెంప్ట్ అయినా దాని పరిణామాలు అనవసరమైన అపార్థాలకు దారి తీయొచ్చు. కొన్నేళ్ల క్రితం సాయి ధరమ్ తేజ్ ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. హెల్మెట్ ప్రాధాన్యం గురించి సుప్రీమ్ హీరో ఎక్కడికి వెళ్లినా పదే పదే చెప్పేది ఇందుకే. మృత్యువు మొహం దగ్గరికి వెళ్లిన సాయికి ఒక యువకుడు ప్రమాద స్థలంలో సహాయం చేసి ఆసుపత్రికి తేవడం అప్పట్లో సంచలనం.

తర్వాత ఆ కుర్రాడిని పట్టించుకోలేదని, ఎలాంటి సహాయం చేయలేదని తేజు మీద రకరకాలుగా ప్రచారం జరిగింది. దానికి సమాధానంగా అప్పట్లోనే తాను ఇచ్చిన చేయూత గురించి తేజు ఫోటోలు వీడియోలు షేర్ చేశాడు. తాజాగా ఆ ఘటన జరిగిన రోజు కనక దాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. అయితే కొందరు నెటిజెన్లు కావాలని మరోసారి సదరు యువకుడి ప్రస్తావన తెచ్చి, తనకు ఏ హెల్ప్ చేయలేదని. అలా గాలికి వదిలేశారని కామెంట్స్ చేశారు.

దానికి తేజు రియాక్ట్ అవ్వడం మళ్ళీ ప్రూఫ్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ హీరోలు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. తప్పు చేయనప్పుడు పదే పదే దాన్ని ఋజువు చేయాల్సిన అవసరం లేదు. అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత. కొందరు రీచ్ కోసం, ఫాలోయర్స్ పెంచడం కోసం కావాలని ఇలా నటీనటులను టార్గెట్ చేస్తూ ఉంటారు. హీరో హీరోయిన్ల నుంచి రెప్లైస్ వచ్చే కొద్దీ వీళ్ళ మీదకు ఇతరుల అటెన్షన్ వచ్చేస్తుంది. తద్వారా పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తారు.

ఇదే క్రమంలో ఇకపై ఈ వాదన నువ్వు చెయ్యకు, నీ తోటి అభిమానులను కూడా చేయొద్దని తేజు చెప్పడం వల్ల అనవసరమైన దుమారం రేపినట్టయ్యింది. ఒకళ్ళు అంటే అది అందరూ అభిమానులు అన్నట్టు ఎలా అవుతుందని సదరు హీరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు కావడం మరో ఆసక్తికర విషయం.

సాయి దుర్గ తేజ్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది. చిరంజీవి,.పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీలో అందరూ ఈ నిందలు పడ్డవాళ్లే. సందర్భం ఉంటే తప్ప అలాంటి వాటికి స్పందించడం కూడా మానేశారు. తేజుకు కావాల్సింది కూడా అదే. అయినా రిలీజ్ ఆలస్యమవుతున్న సంబరాల ఏటిగట్టు ప్రమోషన్ల సంగతి చూసుకోకుండా ఈ అవసరం లేని వ్యవహారాల మీద దృష్టి పెట్టకపోవడం మంచిది. జనవరి 12 ఒక రోజు గ్యాప్ లో చిరంజీవి కాకాతో ఈ సినిమా క్లాష్ కానుంది.

This post was last modified on September 25, 2026 11:59 am

Share

Recent Posts

చైనా అధ్యక్షుడి కోసం ప్రోటోకాల్ బ్రేక్ చేసిన ట్రంప్

దగ్గరదగ్గర పది.. పన్నెండు రోజుల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్ పింగ్…

18 minutes ago

హౌస్ హాజ్బెండ్… ఇక మామూలే…

మీ ఆవిడ ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ వైఫ్ అని సమాధానం చెప్పడం ఇప్పటి వరకు మనం…

39 minutes ago

నాని సామర్ధ్యం… డౌట్లు అక్కర్లేదు

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ ఊహించని స్థాయిలో అతి పెద్ద ఓపెనింగ్ దక్కించుకుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా చెబుతున్న దాని…

48 minutes ago

శ్రీవిష్ణుకి ఫేవరేట్ హీరోతోనే పోటీ

టాలీవుడ్ రిలీజుల వ్యవహారం కేవలం ప్యాన్ ఇండియాలకే కాదు మీడియం సినిమాలకు సైతం ప్రాణ సంకటంగా మారింది. అక్టోబర్ 2…

1 hour ago

ఐబొమ్మ ర‌వికి ఒక గుడ్ న్యూస్… ఒక బ్యాడ్ న్యూస్

పైర‌సీ వెబ్ సైట్ తో తెలుగు.. త‌మిళం.. హిందీ.. ఇంగ్లిషు..ఆ భాష.. ఈ భాష అన్న తేడా లేకుండా సినిమాలు…

5 hours ago

ఈసీ అస్తిత్వానికి భంగం కలుగుతుంది

ప్రపంచం దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి వున్న పేరు ప్రమాదంలో పడిపోయింది. దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం…

5 hours ago