Movie News

శ్రీవిష్ణుకి ఫేవరేట్ హీరోతోనే పోటీ

టాలీవుడ్ రిలీజుల వ్యవహారం కేవలం ప్యాన్ ఇండియాలకే కాదు మీడియం సినిమాలకు సైతం ప్రాణ సంకటంగా మారింది. అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందనే ఉద్దేశంతో శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ ని అక్టోబర్ 9 వేసుకుని దానికి అనుగుణంగా ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. తీరా చూస్తే కుటుంబం పనులు ఇంకా పెండింగ్ ఉండటంతో రెండూ ఒకే రోజు క్లాష్ అయ్యే పరిస్థితి తలెత్తింది. ఇక్కడ ట్విస్టు ఏంటంటే శ్రీవిష్ణు వెంకటేష్ కు డైహార్డ్ అభిమాని. ఎన్నోసార్లు చెప్పుకున్నాడు.

ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే ఎవరూ వెనక్కు తగ్గే సూచనలు లేవు. ఎందుకంటే అక్టోబర్ 15 జైలర్ 2తో పాటు జస్ట్ ఒక్క రోజు గ్యాప్ లో రణబాలి రిలీజవుతున్నాయి. ఈ రెండూ సితార సంస్థ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి పెద్ద ఎత్తున థియేటర్లు అవసరమవుతాయి. కామ్రేడ్ కళ్యాణ్ కు ఇది పెద్ద సమస్య. అయితే అక్టోబర్ 9 ఆదర్శ కుటుంబం ఒకటే ఉంది కాబట్టి పోటీ ఉన్నా పర్వాలేదనుకోవచ్చు కానీ రెండూ ఎంటర్ టైన్మెంట్ జానరే కావడం మరో చిక్కు. ఎలా చూసినా వెంకటేష్ మూవీకే ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది.

ఇప్పటికైతే డేట్లలో ఎలాంటి మార్పు లేదు. దానికి అనుగుణంగానే పబ్లిసిటీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ ఆల్రెడీ మార్కెట్ లో బజ్ తీసుకొచ్చింది. శ్రీవిష్ణుకి ఇలాంటి సంకటం ఈ ఏడాది ఇంతకు ముందు కూడా వచ్చింది. మృత్యుంజయ్, విష్ణు విన్యాసం రెండూ ఒకే డేట్ అనౌన్స్ చేసుకున్నాయి. తర్వాత మాట్లాడుకుని ఒక వారం గ్యాప్ వచ్చేలా చూసుకున్నారు. రెండూ ఫెయిల్ కావడం వేరే విషయం. ఇప్పుడు మాత్రం గురువుని ఢీ కొట్టాల్సిన పరిస్థితి.

టీమ్ కాన్ఫిడెన్స్ ఏమిటంటే రెండు బాగుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వెంకటేష్, శ్రీవిష్ణు ఫాలోయింగ్ దృష్ట్యా ఎవరి ప్రేక్షకులు వాళ్లకు విడిగా ఉంటారు. టాక్ దేనికి మెరుగ్గా వస్తే అది అడ్వాంటేజ్ తీసుకుంటుంది. బడ్జెట్ పరంగా ఆదర్శ కుటుంబం పెద్దదే అయినా కంటెంట్ పరంగా కామ్రేడ్ కళ్యాణ్ ని మరీ తక్కువంచనా వేయడానికి లేదు. శ్రీవిష్ణుకి సామజవరగమన లాంటి సర్ప్రైజులు ఇచ్చిన ట్రాక్ రికార్డు తనది. చూడాలి మరి ఈ కాంపిటీషన్ లో ఎలా తట్టుకుని నిలబడతాడో.

This post was last modified on September 25, 2026 11:19 am

Share

Recent Posts

సోషల్ మీడియాకి రియాక్ట్ అయితే ఎలా

సెలబ్రిటీలు సోషల్ మీడియాకు స్పందించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం టెంప్ట్ అయినా దాని పరిణామాలు అనవసరమైన అపార్థాలకు…

2 hours ago

చైనా అధ్యక్షుడి కోసం ప్రోటోకాల్ బ్రేక్ చేసిన ట్రంప్

దగ్గరదగ్గర పది.. పన్నెండు రోజుల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్ పింగ్…

2 hours ago

హౌస్ హాజ్బెండ్… ఇక మామూలే…

మీ ఆవిడ ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ వైఫ్ అని సమాధానం చెప్పడం ఇప్పటి వరకు మనం…

2 hours ago

నాని సామర్ధ్యం… డౌట్లు అక్కర్లేదు

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ ఊహించని స్థాయిలో అతి పెద్ద ఓపెనింగ్ దక్కించుకుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా చెబుతున్న దాని…

3 hours ago

ఐబొమ్మ ర‌వికి ఒక గుడ్ న్యూస్… ఒక బ్యాడ్ న్యూస్

పైర‌సీ వెబ్ సైట్ తో తెలుగు.. త‌మిళం.. హిందీ.. ఇంగ్లిషు..ఆ భాష.. ఈ భాష అన్న తేడా లేకుండా సినిమాలు…

7 hours ago

ఈసీ అస్తిత్వానికి భంగం కలుగుతుంది

ప్రపంచం దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి వున్న పేరు ప్రమాదంలో పడిపోయింది. దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం…

7 hours ago