సురేందర్ రెడ్డి సమస్య ఎప్పుడు తీరెనో

దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ ప్రాజెక్టు కోసమే ఆ మధ్య జుత్తు, గెడ్డం బాగా పెంచేసిన పవన్ సాధారణ లుక్కులోకి వచ్చేశారు. ఆ మధ్య జరిగిన చిన్న సర్జరి తర్వాత కొంత విశ్రాంతి తీసుకున్న పవన్ ఇప్పుడు పాలనలో ఫుల్ బిజీ అయిపోయారు. నిన్న ఆయన పేరు మీదున్న క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి ఓజి 2 అప్డేట్ రావడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

ఇదంతా బాగానే ఉంది కానీ అసలు సురేందర్ రెడ్డికొచ్చిన సమస్య ఏంటనేది అంతు చిక్కడం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్టోరీ లైన్ నచ్చినప్పటికీ స్క్రిప్ట్ ఫైనల్ షేప్ కొచ్చాక అంత సంతృప్తికరంగా లేదని పవన్ కొన్ని మార్పులు సూచించారట. దానికి అనుగుణంగా వర్క్ చేస్తున్న సూరికి ఇంకొంచెం ఎక్కువ సమయం పట్టేలా ఉందట. ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం సాధారణంగా ఉంది కాబట్టి ఈలోగా పవన్ కళ్యాణ్ ఇంకో సినిమాని పూర్తి చేయొచ్చు.

అందుకే ఓజి 2 తెరమీదకు వచ్చిందని అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఇక్కడో ట్విస్టు ఉంది. దర్శకుడు సుజిత్ నానితో బ్లడీ రొమోయో చేయాలి. ప్యారడైజ్ ఆలస్యం వల్ల ఇది అంతకంత లేట్ అవుతోంది. ఆగస్ట్ నుంచి తప్పుకున్నాక సెప్టెంబర్ అంటున్నారు. కొందరేమో ఏకంగా డిసెంబర్ కు వెళ్లొచ్చని షాక్ ఇస్తున్నారు. ఏది నిజమో నమ్మాలంటే నిర్మాత నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ క్లారిటీ రాదు. అదేమో ఇప్పట్లో వచ్చేలా లేదు.

ఏజెంట్ డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. పవన్ ఇచ్చిన ఛాన్స్ సద్వినియోగపరుచుకుంటే మళ్ళీ కంబ్యాక్ అవ్వొచ్చు. వేరే టయర్ 1, 2 హీరోలెవరూ అందుబాటులో లేరు;. రెండేళ్ల దాకా అందరి డైరీ బిజీగా ఉంది. చిన్న హీరోలతో చేస్తే రేంజ్ తగ్గిపోతుంది. అందుకే ఎంత లేట్ అయినా పవన్ ని ఒప్పించమే సూరి కర్తవ్యం. రామ్ తాళ్ళూరి ఈ కాంబినేషన్ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చూడాలి మరి ఎప్పటికి కార్యరూపం దాల్చేనో.