మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం వల్ల రికవరీ కొంచెం ఫాస్ట్ గా కనిపించినప్పటికీ ఈ బ్రాండ్ కున్న వేల్యూ కోణంలో చూసుకుంటే వసూలు అయ్యింది తక్కువ మొత్తమే. ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై అయిదు కోట్లకు పైగా రాబట్టిన దృశ్యం 3 ట్రిపుల్ సెంచరీ అందుకుంటుందని అభిమానులు భావించారు కానీ ఆ సూచనలు సోసోనే. ఓటిటి విండో వల్ల సాధ్యం కాకపోవచ్చు.
ఇక తెలుగులో ఎందుకు రీమేక్ చేయలేదనే ప్రశ్న వెంకటేష్ అభిమానులను తరచు తొలుస్తూనే ఉంది. దానికి సమాధానం దర్శకుడు జీతూ జోసెఫ్ నుంచే వచ్చేసింది. క్లైమాక్స్ లో కూతురిని కాపాడుకోవడం కోసం జార్జ్ కుట్టి చేసే పనిలో కేరళలో అంగీకరిస్తారు కానీ, ఇతర భాషల్లో హీరోల ఇమేజ్ దృష్ట్యా దాన్ని ఒప్పుకునే అవకాశాలు లేకపోవడం వల్లే వద్దనుకున్నామని క్లారిటీ ఇచ్చారు. సినిమా చూసిన వాళ్లకు ఇది అర్థమవుతుంది. వెంకీని ఆ ట్విస్టులో యాక్సెప్ట్ చేయలేరు.
అయితే హిందీలో అజయ్ దేవగన్ దృశ్యం 3 రూపొందుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. యధాతథంగా తీస్తే నార్త్ ఆడియన్స్ కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉండటంతో క్లైమాక్స్ లో మార్పులు చేసుకుంటామని దర్శక నిర్మాతలు కోరారట. దానికి జీతూ జోసెఫ్ అంగీకరించడంతో వేరే నెరేషన్ తో స్క్రీన్ ప్లే మార్చుకున్నట్టు అర్థమవుతోంది. అంటే మోహన్ లాల్ ని చూసినట్టుగా అజయ్ దేవగన్ చేసే పనులు ఉండబోవడం లేదు.
ఇక దృశ్యం 4 గురించి జీతూ జోసెఫ్ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. కేవలం యూనిట్ సభ్యులు చెప్పడం వల్ల చివర్లో చిన్న ట్విస్టు ఇచ్చామని, అది మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని, అంత మాత్రాన కొనసాగిస్తానన్న గ్యారెంటీ లేదని తేల్చి చెప్పారు. అద్భుతమైన ఆలోచన ఏదైనా వస్తే అప్పుడు చూస్తానని అన్నారు. మొత్తానికి మనం రాంబాబుని ఎందుకు మిస్ అయ్యామో స్పష్టమైన కారణం సృష్టికర్త నుంచే వచ్చేసింది. సో తీసుకున్న వెంకటేష్ నిర్ణయం అన్ని విధాలా మంచిదే.
This post was last modified on June 10, 2026 10:46 am
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…