సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ స్టార్ హీరో, టాలీవుడ్ కు చెందిన యువ దర్శకుడి కలయికలో రీసెంట్ గా ఒక భారీ సినిమా సైలెంట్ గా పట్టాలెక్కింది. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న తరుణంలో, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ప్రాజెక్ట్ కు సడెన్ గా బ్రేక్ పడినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఒక బడా తెలుగు నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ముందుకొచ్చింది. సదరు యువ దర్శకుడు రీసెంట్ గా యూత్ ఫుల్ కంటెంట్ తో ఒక హిట్ సినిమాకు సీక్వెల్ చేసి మంచి ట్రాక్ రికార్డ్ తో ఉన్నాడు. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పుడు ట్రేడ్ మార్కెట్ పరంగా మంచి హైప్ క్రియేట్ అయింది. రెండు ఇండస్ట్రీల కాంబినేషన్లో రాబోతున్న ఈ క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్ కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త మ్యాజిక్ చేస్తుందని మేకర్స్ నమ్మారు.
కానీ కథ వేరు, సెట్స్ మీద జరిగే మేకింగ్ వేరు అనేది షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే అందరికీ అర్థమైందట. మొదటి షెడ్యూల్ పూర్తి కాకముందే హీరో అప్పటివరకు తీసిన రషెస్ చూడాలని డిసైడ్ అయ్యాడట. అయితే ఆ ఫుటేజ్ చూసిన తర్వాత అవుట్ పుట్ పట్ల సదరు స్టార్ హీరోకు ఏమాత్రం సంతృప్తి కలగలేదని ఇండస్ట్రీలో ఒక గట్టి టాక్ నడుస్తోంది. పేపర్ మీద విన్న కథకు, స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అవుతున్న టేకింగ్ కు చాలా వ్యత్యాసం ఉన్నట్లు హీరో ఫీల్ అయ్యాడట.
దీంతో వెంటనే అలెర్ట్ అయిన సదరు హీరో, స్క్రీన్ ప్లేలో కొన్ని కీలకమైన మార్పులు చేయాలని దర్శకుడికి సూచించినట్లు తెలుస్తోంది. ఇక్కడే అసలు సమస్య మొదలై ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తినట్లు సమాచారం. స్క్రిప్ట్ మార్పుల విషయంలో హీరో ఆలోచనా విధానం, దర్శకుడి విజన్ ఏమాత్రం సింక్ కాలేదని తెలుస్తోంది.
ఇద్దరి క్రియేటివ్ వేవ్ లెంగ్త్ అస్సలు కలవకపోవడంతో, ఇలాంటి గందరగోళం మధ్య ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకువెళ్లడం చాలా కష్టమని మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్. అభిప్రాయ భేదాలతో షూటింగ్ సాగదీయడం కన్నా, ఇక్కడితోనే ఆపేయడం బెటర్ అని డిసైడ్ అయ్యారట. దీంతో అఫీషియల్ గా క్యాన్సిల్ అనే బోర్డ్ వేయకపోయినా, నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపుగా అటకెక్కించినట్లే అని ఇండస్ట్రీ సర్కిల్స్ లో గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి.
This post was last modified on June 9, 2026 12:49 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…