Movie News

టాక్సిక్ చుట్టూ వలయం బిగుస్తోంది

అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ బాధ పడుతున్నారు. పోటీ లేని ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని, అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పకుండా, అప్డేట్స్ ఇవ్వకుండా ఇంకా నానుస్తూనే ఉన్నారని వాపోతున్నారు. నిన్న దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన మేకింగ్ వీడియోలో విజువల్స్ బాగానే చూపించారు కానీ అసలు విషయం చెప్పలేదు.

ఇంతకీ 2026లో టాక్సిక్ వస్తుందా రాదానే అనుమానాలు బెంగళూరు వర్గాల్లో బలంగా ఉన్నాయి. ఆప్షన్స్ చూస్తే మ్యాటర్ ఏంటో అర్థమవుతుంది. ఇంగ్లీష్ వెర్షన్ కూడా సమాంతరంగా తీశారు కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ ప్లాన్ చేయాలి. జూలైలో క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సే, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఉన్నాయి. ఆగస్ట్ లో సల్మాన్ ఖాన్ మాతృభూమి, సన్నీ డియోల్ బట్వారా 1947, ఇరుముడి, భోగి మొదలైనవి క్యూ కట్టాయి.

సెప్టెంబర్ లో విజయ్ దేవరకొండ రణబాలితో పాటు వెబ్ సిరీస్ నుంచి సినిమాగా మారిన మిర్జాపూర్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ లో రామాయణ వస్తుంది. దాంట్లో రావణుడిగా నటించింది యశే కాబట్టి పోటీకి ఛాన్స్ లేదు. డిసెంబర్ లో షారుఖ్ ఖాన్ కింగ్, డూన్ 3, అవెంజర్స్ డూమ్స్ డే మొదలైనవి ఉన్నాయి. అక్టోబర్ లో అజయ్ దేవగన్ దృశ్యం 3 ఒకటే ఉంది కాబట్టి ఆ టైంలో ట్రై చేయొచ్చు కానీ హిందీ వెర్షన్ కు కావాల్సినన్ని థియేటర్లు దొరకడం కష్టం.

అసలు ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని టాక్సిక్ బృందం కనక ఫిక్స్ అయితే ముందు డేట్ ప్రకటించాలి. లేదంటే లేనిపోని అయోమయం తలెత్తుతుంది. ఇప్పటికే రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఓటిటి డీల్ కాలేదని, ఇంకో వంద రోజులు రీ షూట్ చేస్తారని ఏవేవో చెబుతున్నారు. వీటికి చెక్ పెట్టాలంటే షూట్ అయ్యిందని గుమ్మడికాయ కొట్టేసి ఎప్పుడు వస్తుందో అనౌన్స్ మెంట్ ఇవ్వాలి. లేదంటే ఇప్పటికే తగ్గిపోయిన బజ్ మరింత రిస్కులో పడుతుంది.

This post was last modified on June 9, 2026 1:57 pm

Share

Recent Posts

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

20 minutes ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

20 minutes ago

మగాళ్లకు పీరియడ్స్ రావాలని వెయ్యిసార్లు ప్రార్థించిన నటి

మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…

2 hours ago

సంపూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందా

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…

3 hours ago

లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న…

4 hours ago

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

6 hours ago