Movie News

స్లమ్ డాగ్ … పూరి కొత్త మార్కు

దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని బాగా ఎలివేట్ చేస్తూ, కథానాయకుడిని పొగరుగా చూపించి, అమ్మాయిని ఇలా కూడా ప్రేమించవచ్చా అని కన్విన్సింగ్ గా చెప్పడంలో ఆయన శైలి వేరు. అందుకే తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ నిరాశ పరిచినా మళ్ళీ తన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్ళ కోసం తీస్తున్నదే స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్.

నిన్న టీజర్ వచ్చేసింది. కథేంటో చూచాయగా చెప్పారు పూరి. రోడ్ల మీద వీధుల అరుగు మీద తలదాచుకునే జాతికి చెందిన వ్యక్తి (విజయ్ సేతుపతి) ని కొన్ని విపరీత పరిస్థితులు ఒక దుర్మార్గుడిని (దునియా విజయ్)ని ఎదిరించేలా చేస్తాయి. కత్తి పట్టేందుకు సైతం వెనుకాడడు. బిచ్చగాడిగా, ఆటో డ్రైవర్ గా, గుడ్డివాడిగా ఇలా రకరకాల రూపాల్లో కనిపిస్తున్న ఈ స్లమ్ వెనుక ఒక లేడీ పోలీస్ (టబు) వెంటపడుతుంది. అసలీ నేర ప్రపంచం ఏమిటో అర్థం కావాలంటే తెరమీద చూడాలి.

రెగ్యులర్ మార్క్ కి భిన్నంగా పూరి కొత్తగా ట్రై చేసిన విధానం కనిపిస్తోంది. ముఖ్యమైన ఆర్టిస్టులను రివీల్ చేసి స్టోరీ గురించి ఎక్కువ క్లూస్ దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. ఒకసారి కళ్ళు లేకుండా కనిపిస్తున్న విజయ్ సేతుపతి మరో సీన్ లో మాములుగా ఉన్నాడు. అంటే ఏదో షాకింగ్ ట్విస్టు దాచి పెట్టారనేది స్పష్టం. సంయుక్త మీనన్ ని మంచి మాస్ టచ్ తో చూపించగా హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా డిఫరెంట్ గా విజువల్స్ కు తగ్గట్టు ఉంది.

స్లమ్ డాగ్ విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. జూలైలోనే ఉండొచ్చని టాక్. త్వరలోనే ప్రకటించబోతున్నారు. పూరికి సాలిడ్ కంబ్యాక్ కావాలి. అది ఈ సినిమాతో నెరవేరుతుందనే నమ్మకం టీమ్ లో బలంగా ఉంది. శ్యాం కె నాయుడు ఛాయాగ్రహణం సమకూర్చారు. తెలుగు హీరో తమిళ దర్శకులను ఎంచుకుంటున్న ట్రెండ్ లో ఒక తమిళ హీరో టాలీవుడ్ డైరెక్టర్ ని నమ్మడం విశేషం. స్లమ్ డాగ్ కనక సక్సెస్ అయితే పూరి మళ్ళీ స్టార్ లీగ్ లోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదు.

This post was last modified on June 9, 2026 8:11 am

Share

Recent Posts

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

10 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

2 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

2 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

2 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

3 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

6 hours ago