Movie News

ఫ్యామిలీ సినిమాను తక్కువ అంచనా వేయొద్దు

‘గుంటూరు కారం’ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయాలనుకున్న చిత్రం.. గాడ్ ఆఫ్ వార్. తన కెరీర్లో తొలిసారిగా ఆయన చేయాలనుకున్న పాన్ ఇండియా, ఈవెంట్ ఫిలిం ఇది. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా వెనక్కి వెళ్లింది. ఐతే ఈలోపు తన స్టయిల్లో చకచకా ఒక ఫ్యామిలీ మూవీ తీద్దామనుకున్నారు. అందుకోసం విక్టరీ వెంకటేష్‌ను హీరోగా ఎంచుకున్నారు.

చకచకా స్క్రిప్టు రెడీ చేసుకుని షూటింగ్‌కు వెళ్లిపోయారు. అదే.. ఆదర్శకుటుంబం-ఏకే 47. ఐతే ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు ఎక్కువ అంచనాలేమీ లేవు. త్రివిక్రమ్ నుంచి ‘గాడ్ ఆఫ్ వార్’ కోసం ఎక్కువమంది ఎదురు చూస్తుండడమే అందుక్కారణం.

త్రివిక్రమ్ ఏదో కాలక్షేపానికి ఈ సినిమా తీస్తున్నాడనే అనుకున్నారు. కానీ క్రమంగా ఈ చిత్రానికి బజ్ పెరుగుతోంది. షూటింగ్, కాస్ట్ అండ్ క్రూ అప్‌డేట్స్ చూస్తుంటే సినిమా రేంజ్ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. దివ్యేందు, నివేథా పెతురాజ్ ఈ సినిమాలో భాగం అయ్యారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలోకి తమన్ వచ్చాడు. షూట్ కోసం కూడా త్రివిక్రమ్ ఎక్కువ టైమే తీసుకుంటున్నాడు. మరోవైపేమో దసరా లాంటి క్రేజీ సీజన్లో ‘ఆదర్శ కుటుంబం’ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

పండుగ సెలవుల్లో సరైన ఫ్యామిలీ మూవీ పడితే బాక్సాఫీస్ ఎలా మోత మోగిపోతుందో.. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు లాంటి చిత్రాలు రుజువు చేశాయి. త్రివిక్రమ్ ఫ్యామిలీ మూవీ అంటే వీటికి మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక వెంకీ అంటే కుటుంబ వినోదానికి కేరాఫ్ అడ్రస్. కాబట్టి ఇది డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు.

త్రివిక్రమ్ రచయితగా వెంకీ నటించిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు ఎంతగా ఎంటర్టైన్ చేశాయో తెలిసిందే. ఇప్పుడు దర్శకుడిగా వాటికి దీటైన సినిమానే త్రివిక్రమ్ అందిస్తాడనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. కాబట్టి అన్నీ సరిగ్గా కుదిరితే ఇది ‘మన శంకర వరప్రసాద్ గారు’ను కూడా మించి రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం.

This post was last modified on June 8, 2026 2:09 pm

Share

Recent Posts

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

1 hour ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

10 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

12 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

13 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

13 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

16 hours ago