Movie News

టికెట్ రేట్లు కాస్త ఆలోచించండి సారూ

పెద్ది వీకెండ్ ఘనంగా పూర్తి చేసుకుంది. టాక్స్, రివ్యూస్, కాంట్రావర్సీ సంగతి ఎలా ఉన్నా జనం థియేటర్లకు పోటెత్తిన మాట వాస్తవం. మొదటి వారాంతానికి రెండు వందల యాభై కోట్లు దాటడం అంటే మాటలు కాదు. ముఖ్యంగా ఆంధ్ర, గోదావరి జిల్లాల వైపు పెద్దికి బ్రహ్మరథం దక్కుతోంది. సీడెడ్ లోనూ బలంగా ఉంది. నైజామ్ సంగతి సరేసరి. హైదరాబాద్ లో ఆదివారం రోజు మంచి థియేటర్లలో టికెట్ ముక్క మిగల్లేదు. సరే ఇక్కడి దాకా అంత సానుకూలంగా జరిగింది.

అసలు పరీక్ష సోమవారం నుంచి మొదలుకానుంది. పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే విధంగా రెండు ప్రభుత్వాలు జిఓ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సామాన్య ప్రేక్షకుల నుంచి విన్నపం ఏంటంటే వీలైనంత త్వరగా సాధారణ ధరలు అమలు చేస్తే ఎక్కువ శాతం పెద్దిని చూసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మల్టీప్లెక్సుల్లో 177 రూపాయలు ఉన్న టికెట్ ఇప్పుడు 302 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోంది. కుటుంబాలకు ఇదే సమస్య.

చూసేవాళ్ళు చూస్తున్నారుగా అనుకోవచ్చు. నిజమే. కానీ ఇదే స్పీడ్ మాములు రోజుల్లో ఆశించడం కష్టం. ఎందుకంటే జూన్ 12 నుంచి స్కూళ్ళు కాలేజీలు తెరవబోతున్నారు. తల్లితండ్రులకు ఫీజులు, బుక్కులు గట్రా బోలెడు ఖర్చులు ఉంటాయి. ఈ టైంలో సినిమా వ్యవహారం పట్ల అంత సుముఖత చూపించరు. అయినా సరే పెద్దికున్న క్రేజ్ దృష్ట్యా చాలా ఫ్యామిలీస్ మొదటి నాలుగు రోజుల్లోనే చూసేశాయి. ఇంకా చూడాల్సిన కుటుంబాలు లక్షల్లో ఉంటాయి.

సో మరీ పదమూడో తేదీ దాకా కాకుండా కాస్త ముందస్తుగా తగ్గిస్తే బాగుంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో 420 నుంచి 350, సింగల్ స్క్రీన్ 275 నుంచి 200 రూపాయలకు తగ్గించబోతున్నారని సమాచారం. ఇదే విధంగా ఏపీలోనూ తగ్గిస్తే బాగుంటుంది. కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ చేస్తున్నారని తెలిసింది. ఇలా కాకుండా అన్ని సెంటర్లలో ఒకేసారి తగ్గింపుని అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. బయ్యర్ వర్గాలు కోరుకున్నట్టు పెద్దికి లాంగ్ రన్ రావాలంటే ఈ దిశగా ఆలోచించాలి.

This post was last modified on June 7, 2026 11:01 pm

Share

Recent Posts

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంత్రుప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

24 minutes ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

2 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

7 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

10 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

10 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

10 hours ago