పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర, దాన్ని డిజైన్ చేసిన విధానం గురించి సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. విచిత్రంగా కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ దీని గురించి నీతి పాఠాలు వల్లె వేయడం మహా విచిత్రం. సౌత్ లో బూతులు, బోల్డ్ కంటెంట్ వీలైనంత పరిమితంగా ఉంటాయి. డైలాగులు కూడా జుగుప్స కలిగేలా రాయరు. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కాకపోతే అప్పుడప్పుడు సన్నని గీత దాటడం కాదనలేం. ఇక అసలు మ్యాటర్ కొద్దాం.
అచ్చియమ్మ క్యారెక్టర్ పైట ఎగరేయడం, లేదా రెండు బూతు లాంటి పదాలు పలకడం తప్పే అనుకుందాం. దర్శకుడు బుచ్చిబాబు పబ్లిక్ గా క్షమాపణ కూడా చెప్పేశారు. 2005 ఆషిక్ బనాయా ఆప్నే టైటిల్ సాంగ్ లో ఇమ్రాన్ హష్మీ, తనుశ్రీ దత్తా మధ్య చూపించిన కెమిస్ట్రీ ఏ నీలి చిత్రానికి తీసిపోదు. మస్తీ, గ్రాండ్ మస్తీ, క్యా కూల్ హై హమ్, నో ఎంట్రీ లాంటి వాటిలో ఇన్ డైరెక్ట్ గా కాదు నేరుగా బూతులు ఉంటాయి. అవన్నీ సెన్సార్ దాటుకుని థియేటర్లకు వచ్చి డబ్బులు తెచ్చినవే.
ఇదేదో కేవలం హిందీ సినిమాలకే పరిమితమని చెప్పడం లేదు. చిత్రంలో టీనేజ్ యువత మధ్య కామం ఎలా మొదలవుతుందో తేజ సున్నితంగా చూపించినా రొమాన్స్ ఘాటుగానే ఉంటుంది. సింహాద్రిలో హీరోయిన్ ఒంటి మీద చీమను పరిగెత్తించడం వెనుక ఉన్నది మాస్ వర్గాలను మెప్పించే లక్ష్యమే. యానిమల్ లో ఇంటి ముందు లాన్ లో రన్బీర్ కపూర్ బట్టలు లేకుండా తిరిగినా, అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ లో హీరో మంచం మీదే ప్రకృతి ధర్మం నిర్వహించినా అవన్నీ కల్ట్స్ అయిపోయాయి.
ఇదంతా పెద్దిని సమర్ధించే ప్రయత్నం ముమ్మాటికీ కాదు. ఎమ్మెల్యే క్యాండిడేట్ కూతురిని అలా చూపించడం ఆమోదయోగ్యం కాదు. అలాని గతంలో అసలెప్పుడూ ఈ తరహాలో ఎవరూ చేయలేదని చెప్పడమే పెద్ద కామెడీ. దానికి వత్తాసుగా ఏదో ఘోరం జరిగిపోయిందనే తరహాలో ఎక్స్ హ్యాండిల్స్ నీతి వ్యాఖ్యలు చేయడం మరింత హాస్యాస్పదం. సరే పెద్దిలో జరిగిందేదో జరిగిపోయింది ఇక రాబోయే సినిమాల్లో ఇలాంటివి రిపీట్ అయినప్పుడు ఇవే రియాక్షన్లు వస్తాయేమో చూడాలి.
This post was last modified on June 8, 2026 7:03 am
అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ‘రంభ ఊర్వశి మేనక’ రిలీజ్‌కు ముందు ఊహించని సమస్యలో పడినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 3న…
చాలా ఏళ్ల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరిగా ఉండి.. అనివార్య కారణాలతో రెండేళ్ల కిందటే ఆ పార్టీ నుంచి బయటికి…
ఓ హారర్ థ్రిల్లర్ కథ కోసం హీరోను వెతుకుతున్న సమయంలో ఓ యువ నటుడి పేరు వచ్చిందట. ఒకప్పుడు హిందీ…
ఒక పెద్ద సక్సెస్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం కోసం స్టార్లు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి ఖరీదైన మూల్యం చెల్లించేలా చేస్తాయి.…
వైసీపీ అధినేత జగన్ పేదల పక్షపాతి అని.. ప్రజలకు ఎంతో మేలు చేశారని.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్…
నిన్న విడుదలైన యెషనాగుల కట్ట మీద పాట సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది. ముఖ్యంగా ఇతర స్టార్ హీరోల…