పెద్ది విషయంలో అధిక శాతం పాజిటివ్ గా ఉంది కానీ నెగటివ్ కామెంట్స్ వచ్చిన అంశం జాన్వీ కపూర్ పాత్ర మాత్రమే. ఆమెను పరిచయం చేసిన విధానంతో పాటు రామ్ చరణ్ ప్రేమలో పడే క్రమాన్ని డిజైన్ చేసిన తీరు కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బందిగా మారింది. ఫీడ్ బ్యాక్ ని దర్శకుడు బుచ్చిబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఇవాళ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన సందేశంలో మహిళల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, వాళ్ళను కించపరిచే విధంగా ఎలాంటి కంటెంట్ ఇవ్వనని హామీ ఇచ్చారు.
అందులో భాగంగా ఇవాళ నుంచి ప్రదర్శించే పెద్ది షోల నుంచి అభ్యంతరం వచ్చిన సన్నివేశాలకు సంబంధించి కీలక మార్పులు చూస్తారని అందులో చెప్పుకొచ్చారు. నిజానికిది మంచి నిర్ణయమే. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్లు నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని అంత సులభంగా తీసుకోరు. ఆ మధ్య ఒక దర్శకుడు లెన్త్ ఎక్కువయ్యిందని ఫీడ్ బ్యాక్ ఇస్తే మీకే చూడటం రాదని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కట్ చేస్తే మంచి ఫలితం అందుకోవాల్సిన ఆ మూవీ చివరికి ఫ్లాప్ ముద్ర వేయించుకుంది.
కానీ బుచ్చిబాబు అలాంటి తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్నాడు. ఇదేదో ముందే చేసి ఉండొచ్చు కదానే కామెంట్స్ ఆన్ లైన్ లో వస్తున్నాయి. కానీ స్క్రిప్ట్ దశలో లేదా ఎడిటింగ్ టేబుల్ మీద కొన్ని సీన్లు మాస్ కోసం వర్కౌట్ అవుతాయేమోననే ఫీలింగ్ సహజంగా యూనిట్ లో ఉంటుంది. ఇంతకన్నా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు గతంలో లెక్కలేనన్ని వచ్చాయి. వాటి మీద సీరియస్ డిస్కషన్ జరిగిన దాఖలాలు తక్కువ. పెద్దినే హైలైట్ అవుతోంది.
ఆ మార్పులు ఏంటి అనేది ఈ రోజు నుంచి పెద్దిలో చూడొచ్చు. జాన్వీ కపూర్ కు దేవరలోనూ పెద్ద స్కోప్ దక్కలేదు. ఇప్పుడు పెద్దిలో క్యారెక్టర్ అలా ఉండటం వల్ల నటన కన్నా ఎక్కువ వేరే ఎలిమెంట్స్ మీద ప్రతికూల అభిప్రాయాలకు చోటు దక్కింది. అయినా మన దర్శకులు కూడా శ్రీదేవి కూతురిని ఎంత బాగా ప్రెజెంట్ చేయగలం అనే దాని మీద దృష్టి [పెట్టాలి తప్పించి కేవలం ఒక గ్లామర్ బొమ్మగా చూపించాలనే మూసలో నుంచి బయటికి రావాలి. అప్పుడే ఇలాంటివి మళ్ళీ రిపీట్ కావు.
This post was last modified on June 6, 2026 11:11 am
దేశంలోనే అత్యధిక సినీ అభిమానం ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే అంటే అతిశయోక్తేమీ కాదు. కానీ ఇంతటి అభిమానం ఉన్న చోట…
పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘకాలం పాటు పాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం…
ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…