Movie News

అనుకోని పొరపాటు అవాంతరం అయ్యింది

పెద్ది విడుదలయ్యాక హైలైట్ అవ్వాల్సిన విషయాలు కాకుండా అవసరం లేనిది ఒకటి చర్చలోకి వచ్చింది. అదే జాన్వీ కపూర్ పాత్ర. ఆమెను డిజైన్ చేసిన విధానం బాలేదని, గ్లామర్ పేరుతో అలా ప్రొజెక్ట్ చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడ్డారని మాట్లాడుకున్నారు. ఇది చాలా దూరం వెళ్లిందని గుర్తించిన దర్శకుడు బుచ్చిబాబు హీరో హీరోయిన్ మధ్య ఒక సరదా ప్రేమకథ కోసం ఇచ్చిన గ్లామర్ కోటింగ్ ఇలాంటి స్పందన తెచ్చుకుంటుందని ఊహించలేదని అన్నారు.

భవిష్యత్తులో రిపీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు. ఇది బాగానే ఉంది కానీ స్క్రిప్ట్ దశలోనే ఇలాంటివి ఒకటికి రెండుసార్లు విశ్లేషించుకుని ఉంటే ఇప్పుడీ సమస్య వచ్చేది కాదు. పబ్లిక్ స్టేజి మీద జాన్వీతో అసభ్యంగా ప్రవర్తించారని విలన్ గ్యాంగ్ ని వెంటాడి తుక్కురేపిన పెద్ది, మరి అదే పరిచయం లేని అమ్మాయి అనుమతి లేకుండా చీకట్లో ఆమె గదిలోకి వెళ్లి చొరవ తీసుకోవడం కూడా తప్పే కదా. ఇలాంటి లాజిక్సే ఇంత డిస్కషన్ కు దారి తీశాయి.

ప్రస్తుతం వీటిని సరిచేసే పనిలో టీమ్ ఉన్నట్టు టాక్ ఉంది కానీ ఎంతమేరకు నిజమో ఇవాళో రేపో షో చూశాక తెలుస్తుంది. సుకుమార్ కూడా రంగస్థలంలో చరణ్, సమంత మధ్య తొలి పరిచయాన్ని బాత్ రూమ్ లోనే మొదలుపెడతారు. కానీ అసభ్యంగా అనిపించదు. పుష్పలో బన్నీ, రష్మిక మధ్య కెమిస్ట్రీ మాస్ గా ఉన్న ఎబ్బెట్టుగా అనిపించదు. ఇదే బుచ్చిబాబు ఉప్పెనలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి మధ్య లవ్ ని ఎంత క్యూట్ గా చూపించారో మూవీ లవర్స్ కి గుర్తే.

అలాంటిది రామ్ చరణ్ లాంటి పెద్ద రేంజ్ హీరోని ఎంచుకున్నప్పుడు క్వాలిటీ కూడా అంతే ఎత్తులో ఉండాలనేది కాదనలేని అభిప్రాయం. మాస్ కోసం ఇలా చేశామని బుచ్చిబాబు సమర్దించుకోవచ్చుగాక. కానీ కంటెంట్ లో సీరియస్ నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎమోషన్ మీద ఆధారపడిన సబ్జెక్టు అయినప్పుడు కొన్ని క్యాలికులేషన్లు కఠినంగా ఉండాలి. అవి మిస్ కావడం వల్లే రామ్ చరణ్ నటన మీద ఉండాల్సిన ఫోకస్ అవసరం లేని అంశాల వైపుకు వెళ్ళిపోయింది.

This post was last modified on June 6, 2026 9:39 am

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

54 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

2 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

4 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

4 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago