ఈ ఏడాది ఇండియా మొత్తంలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ‘పెద్ది’ థియేటర్లలోకి దిగేసింది. అఫీషియల్ రిలీజ్ ఈ రోజే అయినా.. నిన్న రాత్రి పెయిడ్ ప్రిమియర్స్‌తోనే పెద్ది సందడి మొదలైపోయింది. సినిమా టీం చెప్పినంత గొప్పగా లేని మాట వాస్తవం. కానీ ఇది మంచి సినిమా అనడంలో సందేహం లేదు. కొన్ని కంప్లైంట్లు ఉన్నప్పటికీ.. చాలా వరకు సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది.
కేవలం రామ్ చరణ్ పాత్ర, పెర్ఫామెన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చనడంలో మరో మాట లేదు. చరణ్ మాత్రం తన మీద పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గని పెర్ఫామెన్సే ఇచ్చాడు. ఈ పాత్ర మీద దర్శకుడు బుచ్చిబాబు సానా పెట్టిన శ్రద్ధ ప్రశంసనీయం. ఐతే ఒక శిఖరంలా నిలబడ్డ పెద్ది పాత్రకు సరైన జోడీని పెట్టడంలో మాత్రం బుచ్చిబాబు ఫెయిలయ్యాడు.
ఒక మంచి కథ రాసి, బలమైన ఎమోషన్లతో ప్రేక్షకులను కదిలించేలా సినిమా తీసిన బుచ్చిబాబు.. హీరోయిన్ విషయంలో మాత్రం మరీ స్టీరియో టైప్‌లో ఆలోచించాడన్నది ప్రేక్షకుల కంప్లైంట్.
‘చికిరి చికిరి’ పాట.. ట్రైలర్ చూసినపుడే చాలామంది జాన్వి అప్పీయరెన్స్ విషయంలో పెదవి విరిచారు. అసలు ఏ ఊరిలో అయినా అమ్మాయి, అది కూడా ఎమ్మెల్యే కూతురు ఇలా ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ప్రోమోలతోనే ఈ పాత్ర మీద సరైన అభిప్రాయం కలగకపోగా.. సినిమా చూశాక మరింత ఫీలింగ్ మరింత నెగెటివ్‌గా మారుతుంది.
ఇటు విమర్శకులు, ఇటు సామాన్య ప్రేక్షకులు అందరూ మూకుమ్మడిగా ఈ పాత్ర తీరును తప్పుబడుతున్నారు. సినిమాలో మైనస్ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నది జాన్వి విషయంలోనే. బుచ్చిబాబు ఆ పాత్రను ప్రెజెంట్ చేసిన తీరే బాగా లేకపోగా.. జాన్వి నటన కూడా పేలవంగా ఉండడంతో అందాల విందు చేయడం తప్ప ఆమెలో ఏం టాలెంట్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
‘దేవర’ విషయంలోనూ జాన్వి ఇలాంటి విమర్శలే ఎదుర్కోగా.. ఈసారి విమర్శల జడి ఇంకా పెరిగేలా ఉంది. హిందీలో కొన్ని చిత్రాల్లో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చిన జాన్వికి.. తెలుగులో మాత్రం ఇలాంటి పాత్రలే పడుతుండడం తన దురదృష్టం అనే చెప్పాలి.
This post was last modified on June 4, 2026 5:00 pm
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…