Movie News

బండ్ల గణేష్ ఫైర్.. ప్రకాష్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్

సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణం అని గణేష్ చెబుతుంటారు. అటువంటిది ఆయనను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటారా? ఇప్పుడు అదే జరిగింది.

సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగా కూడా చైతన్యంగా ఉండే ప్రకాష్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఉంటారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కూడా స్పందిస్తుంటారు. వాటికి ఎప్పుడూ పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చిన దాఖలాలు లేవు.

తాజాగా జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేసే అంశంపై పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. రెండు రోజుల తర్వాత వివాదం సద్దుమణిగిందని అనుకుంటుండగా ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. “ఒంటరిగా వస్తున్నావా? పొత్తులతో వస్తున్నావా? క్లారిటీ ఇచ్చి రా” అంటూ ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. “ఒరే.. నీకెందుకురా.. ప్రతి దాంట్లో వేలు పెడతావు? నువ్వు తమిళోడివా? తెలుగోడివా? కన్నడోడివా?” అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా, “నీ ఊరేది? నీ కథేంటి? అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు.

ముందు నీ అడ్రస్ తెలుసుకో.. ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి” అంటూ ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చారు. జనసేన తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, వాటిపై ప్రకాష్ రాజ్ స్పందన, బండ్ల గణేష్ కౌంటర్‌తో రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

This post was last modified on June 4, 2026 12:35 pm

Share

Recent Posts

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

43 minutes ago

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

1 hour ago

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

4 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

6 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

7 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

7 hours ago