Movie News

మాట నిలబెట్టుకున్న AR రెహమాన్

అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల అనుభవమున్న ఏఅర్ రెహమాన్ పేరుని దర్శకుడు బుచ్చిబాబు ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ చాలా అనుమాన పడ్డారు. ఎందుకంటే టాలీవుడ్ లో ఆయన ట్రాక్ రికార్డు అలాంటిది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు కొమరం పులి పేరు చెబితే భయపడతారు. సినిమా బాగోకపోవడం పక్కనపెడితే కనీసం మంచి పాటలు ఉండవు.

ఆలాంటి రెహమాన్ పెద్దికి న్యాయం చేస్తాడా అనే డౌట్లు ఎట్టకేలకు పటాపంచలయ్యాయి. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ తో బోణీనే బలంగా స్టేడియం బయటికి కొట్టిన ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆ తర్వాత రైరై రారయ్ తో మరో బౌండరీ బాదారు. ఐటెం సాంగ్ ఆశించినంత పెద్ద స్థాయిలో లేకపోయినా మస్సా మస్సా ఆ లోటుని తీర్చేసింది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి. ఓవర్ సౌండ్ లేకుండా చక్కగా ఇచ్చిన వైనం ఆకట్టుకుంది.

ఈ మధ్య ఎలివేషన్ల ట్రెండ్ లో డాల్బీ స్పీకర్లు బద్దలయ్యే రేంజ్ లో వాయిద్యాలు వాడటం కామన్ అయిపోయింది. కానీ రెహమాన్ వాటి జోలికి వెళ్ళలేదు. 1990 నాటి విజయనగరం బ్యాక్ డ్రాప్ కాబట్టి దానికి తగ్గట్టే అప్పటి మూడ్ ప్రతిబింబించేలా కంపాజ్ చేసిన విధానం కొత్తగా అనిపించింది. అక్కడక్కడా రెండు మూడు చోట్ల ఇంకాస్త మెరుగ్గా ఇచ్చి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది కానీ ఓవరాల్ గా చూసుకుంటే రెహమాన్ పెద్దికి పెద్ద బలమయ్యారు.

ఇకపై రెహమాన్ కు టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెళ్లడం ఖాయం. అయితే తమిళంలోనే యమా బిజీగా ఉన్న ఆయన అంత ఈజిగా ఒప్పుకోకపోవచ్చు ఒకటో రెండో చేసే అవకాశాలు లేకపోలేదు. చిరంజీవి 158 కోసం తొలుత ఈ ఆప్షన్ పరిశీలించారట గాని తర్వాత ఏవో కారణాల వల్ల ఆ ఛాన్స్ తమన్ కు వెళ్లిందనే టాక్ బలంగానే ఉంది. ఏదైతేనేం ఎప్పుడూ చూడని విధంగా రెహమాన్ ఒక తెలుగు సినిమా ప్రమోషన్ కోసం చాలా కేర్ తీసుకున్నారు. దానికి తగ్గ ఫలితం వస్తే చాలు.

This post was last modified on June 4, 2026 6:54 pm

Share

Recent Posts

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

15 minutes ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

1 hour ago

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

2 hours ago

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

5 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

7 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

7 hours ago