ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నప్పుడు నిర్మాతకు ఫలితం కన్నా ఎక్కువగా ఆందోళనకు గురి చేసే అంశాలు చాలా ఉంటాయి. వాటిలో ప్రధానమైంది డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం. ఇంకొన్ని గంటల్లో పెద్ది ప్రీమియర్ షోలు మొదలుపెట్టబోతున్న టైంలో నేషనల్ మల్టీప్లెక్సుల బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు హిందీ వెర్షన్లు ప్రదర్శించే ముంబై లాంటి సిటీస్ లో టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాక ఒత్తిడి పెరిగింది.
చివరికి తీవ్ర చర్చల తర్వాత శుభం కార్డు పడింది. ఇంకో నాలుగు గంటల్లో మొదటి షో పడుతుంది అనంగా ఎట్టకేలకు రూట్ క్లియర్ అయ్యింది. అయితే ఇలా జరగకుండా ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండాల్సిందనేది వాస్తవం. ఇలా చివరి నిమిషం దాకా ప్రెజర్ పెట్టుకోవడం వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. ప్రీమియర్ షో లేదా మొదటి రోజే చూడాలని ఫిక్స్ అయిన సినీ ప్రియులు బుకింగ్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు.
ఒకవేళ వాళ్ళు కోరుకున్న థియేటర్ లో కనక బుకింగ్స్ కనిపించకపోతే వేరే వాటికి వెళ్లడమో లేదా అసలు మానుకోవడమో చేస్తారు. పెద్దికి దీని విషయంలోనే కాదు డిస్ట్రిబ్యూషన్ పరంగా నైజాంలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని సెంటర్స్ లో సింగల్ స్క్రీన్ గురించి కాంట్రావర్సీలు వచ్చాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తిరిగాయి. అంతా సాఫీగా ఉందన్న టైంలో ఇలాంటి అడ్డంకులు అనవసరమైన డైవెర్షన్ తీసుకొస్తాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో యాభై కోట్ల గ్రాస్ దాటేసిన పెద్ది ఒకవేళ మల్టీప్లెక్సులు కనక ఒక రోజు ముందే షోలు పెట్టేసి ఉంటే డెబ్భై అయిదు కోట్లను టచ్ అయ్యేదన్న కామెంట్స్ ని కొట్టి పారేయలేం. ఇప్పుడు కూడా మించి పోలేదు. ట్రెండింగ్ చాలా స్పీడుగా ఉంది. రెగ్యులర్ షోలు తెల్లవారుఝామున నుంచి మొదలవుతున్న నేపథ్యంలో ఫస్ట్ డే ఫిగర్స్ చాలా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్ నమోదయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. చూడాలి ఏం జరగనుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates