Movie News

విజయ్ vs అన్నామలై… అసలు సాధ్యమేనా?

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ ఎన్నికల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళ వెట్రిగ కజగం (టీవీకే) రెండు పెద్ద పార్టీలను చిత్తు చేసి అధికార పార్టీగా అవతరించిన తీరు ఈ ఆసక్తిని మరింతగా పెంచింది. ఈ ఆసక్తి ఎక్కడిదాకా వెళ్లిందంటే… తమిళనాడు అసెంబ్లీకి 2031లో జరిగే ఎన్నికల సమీకరణాల వరకూ వెళ్లిపోయింది. 2031లో జరిగే తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విజయ్ వర్సెస్ అన్నామలై అంటూ ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ విశ్లేషణలు ఎంతమేర కార్యరూపం దాలుస్తాయన్న దానిపైనా ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు నూతన సీఎం విజయ్ ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే రాజకీయ పార్టీని ప్రకటించి… రెండేళ్ల పాటు ప్రజల్లో తిరిగారు. అప్పటికే తనకున్న స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను చక్కగా వినియోగించుకున్న విజయ్… ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ విజయానికి దివంగత నేతలు కరుణానిధి, జయలలితల మరణాలతో ఏర్పడిన రాజకీయ శూన్యతను సద్వినియోగం చేసుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. 2031 నాటికి విజయ్ పార్టీ ఓ ప్రధాన పోటీదారుగా అయితే ఉంటుందని పక్కాగా చెప్పవచ్చు.

ఇక బీజేపీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమైపోయిన అన్నామలై విషయానికి వస్తే.. అసలు ఆయన రాజకీయ ప్రయాణం ఎలా అన్న దానిపై ఇప్పటిదాకా స్పష్టతే లేదని చెప్పాలి. ఓ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న అన్నామలై… తన సివిల్ సర్వెంట్ పదవికి రాజీనామా చేసి మరీ…రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చీరాగానే బీజేపీ బాటలో నడిచిన ఆయన… బీజేపీ తమిళనాడు అధ్యక్షుడి హోదాలో పలు కీలక కార్యక్రమాలకు దిగారు. బహిరంగంగా తనను తాను కొరడాతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేసిన అన్నామలై దేశవ్యాప్తంగా అయితే గుర్తింపును దక్కించుకున్నారు. అయితే ఆయన భవిష్యత్తు రాజకీయ చిత్రం ఏమిటన్నది ఇప్పటికీ తెలియదనే చెప్పాలి.

అన్నామలై బీజేపీని వీడే దిశగా సాగుతూ ఉంటే… ఆయనను పార్టీలోనే నిలుపుకునే దిశగా కమలం పార్టీ యత్నిస్తోంది. అయినా బీజేపీని వీడినా అన్నామలై… విజయ్ స్థాయిలో ప్రజాదరణను చూరగొంటారన్న గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే… ఇప్పటికే ఓ రాజకీయ పార్టీలో పనిచేసిన ఆయన ఆ పార్టీని వీడి బయటకు వచ్చేందుకు యత్నిస్తూ… రాజకీలపై తనకు ఇంకా స్పష్టత రాలేదన్న విషయాన్ని తనకు తానుగానే బయటపెట్టుకున్నారు. విజయ్ కి కోట్లాది మంది ఫ్యాన్స్ ఓట్లు వేసి, వెయించి ఆయనకు గెలుపును అందిస్తే… ఆ స్థాయిలో అన్నామలైకి ఓట్లు వేసి, వేయించే వారు ఎవరన్నది ప్రశ్నార్థకం. వెరసి విజయ్ తో అన్నామలై పోలిక అసలు కుదరదని చెప్పాలి. అంతేకాకుండా… విజయ్ కి ఆయన ప్రధాన ప్రత్యర్థి అవుతారన్నది దాదాపుగా సాధ్యం కాదని చెప్పాలి.

Kumar

Recent Posts

తెలంగాణలో జనసేన సింగిల్ గా గర్జిస్తుందా?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…

4 hours ago

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

9 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

12 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

14 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

14 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

14 hours ago