Movie News

రణబాలి… చెప్పిన టైముకి రావాలి

ప్రేమికుల నుంచి నిజ జీవిత భార్యాభర్తలుగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలి. టాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా సెప్టెంబర్ 11 విడుదల తేదీని ఆల్రెడీ అధికారికంగా ప్రకటించింది. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్రం రాకముందు పరిస్థితులను నేపథ్యంగా తీసుకుని మైత్రి మూవీ మేకర్స్ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

అందరిలాగే రణబాలి కూడా చెప్పిన డేటుకి వస్తుందా రాదానే అనుమానాలు రౌడీ బాయ్ అభిమానుల్లో లేకపోలేదు. కానీ టైంకి రావడం ఈ సినిమాకు చాలా అవసరం. ఎందుకంటే రౌడీ జనార్ధన షూటింగ్ కూడా సమాంతరంగా జరుగుతోంది. దాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇంతకు ముందే ప్రకటించారు. ఒకవేళ మిస్ అయితే సంక్రాంతి బరిలో దిగొచ్చు. రణబాలి లేట్ అయితే ఆటోమేటిక్ గా దీన్ని కూడా పుష్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

ఇక్కడితో అయిపోలేదు. హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ డైరెక్షన్ లో ఇటీవలే ఒక మెగా ప్రాజెక్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాన్ని 2027 వేసవి లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారట. డ్రాగన్ లాంటి వాటితో తలపడకుండా మంచి డేట్ సెట్ చేసుకునే విధంగా ప్రణాళికలు వేస్తున్నారు. ఇవి కాకుండా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ రెడీగా ఉన్నాడని గతంలోనే టాక్ వచ్చింది. గుర్రాల నేపథ్యంలో చాలా డిఫెరెంట్ కాన్సెప్ట్ ఉంటుందట.

అంటే ఒకేసారి నాలుగు సినిమాల ప్లానింగ్ తో విజయ్ దేవరకొండ మాములు స్కెచ్ తో లేడని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ప్లానింగ్ ఎక్కడ మిస్ అయినా, షూటింగులు ఏవైనా ఆలస్యం అయినా ఒకదాని ప్రభావం మరొకదాని మీద పడుతుంది. ఈ నగరానికి ఏమైంది 2 అయ్యాక దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి పెళ్లి చూపులు కాంబో రిపీట్ చేయాలని ట్రై చేస్తున్నారు. విజయ్ కూడా సుముఖంగానే ఉన్నాడు. ముందైతే రణబాలి మొదటి అడుగు విజయవంతంగా పడాలి.

This post was last modified on May 31, 2026 12:29 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

28 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

36 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

40 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

1 hour ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago