Movie News

కంటెంట్ ఉంటే చాలు కోట్లలో కనకవర్షం

కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం, లిటిల్ హార్ట్స్ లాంటివి ఎలాంటి అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్స్ అందుకోవడం ప్రత్యక్షంగా చూశాం. తాజాగా గుజరాతిలో దేవూల్ బంద్ 2 అనే మూవీ రిలీజయ్యింది. బడ్జెట్ కేవలం 9 కోట్లు. కట్ చేస్తే పది రోజులు తిరక్కుండానే 40 కోట్లకు పైగా వసూలు చేసి హాఫ్ సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. 1100 స్క్రీన్లతో రిలీజైతే మరో 600 అదనంగా పెంచారు.

ఇక్కడో ఆసక్తికరమైన విషయం మాట్లాడుకోవాలి. దేవూల్ బంద్ 2 కథ మరీ కొత్తగా ఉండదు. కష్టాల్లో ఉన్న సంగీత అనే ఒక మహిళా రైతు వాటిని తట్టుకోలేక ఒక చీమల పుట్ట మీద రాయి విసురుతుంది. అనూహ్యంగా మహిమాన్వితుడైన స్వామిజి ఆమెకు దర్శనమిస్తారు. ఆయన్ను ఊరిలోకి తీసుకెళ్తుంది. అయితే సంగీతకు తప్ప స్వామి వేరొకరికి కనిపించరు. దీంతో ఆమె ప్రవర్తన అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలే అసలు స్టోరీ.

వినగానే గోపాల గోపాల, కృష్ణార్జున, మా ఊళ్ళో మహాశివుడు లాంటివి గుర్తొస్తున్నాయి కదా. దేవూల్ బంద్ 2 కూడా అలాంటిదే. భక్తుడి కోసం దేవుడు భూమి మీదకు వచ్చి అతని సమస్యలు తీర్చడం చాలాసార్లు చూశాం. రాబోయే శ్రీకాంత్ మిస్టర్ మిడిల్ క్లాస్ కూడా ఇదే బాపతే. అయితే దేవూల్ బంద్ 2 స్క్రీన్ ప్లే, ట్రీట్ మెంట్ కొత్తగా ఆద్యంతం వినోదాత్మకంగా ఉండటంతో జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో స్పందన బాగుంది.

దీనికి దర్శకుడు ప్రవీణ్ తార్దే. భార్య స్నేహాలే ప్రధాన పాత్రధారి. చాలా తక్కువ సమయంలో దీన్ని పూర్తి చేయడం గమనార్హం. ఇటీవలే హాలీవుడ్ అబ్సెషన్ కేవలం పది కోట్లతో తీస్తే వెయ్యి కోట్లు వసూలు చెయ్యడం చూసాం. అదే తరహాలో దేవూల్ బంద్ 2 కూడా సెన్సేషన్ అయ్యేలా ఉంది. దీన్ని తెలుగు రీమేక్ చేయడం గట్రా ఉండకపోవచ్చు కానీ దర్శక రచయితలు మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అంశం ఒకటుంది. అదే కంటెంట్ ఈజ్ కింగ్.

This post was last modified on May 31, 2026 8:31 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago