తెలంగాణ అన్న పదం డిక్షనరీలోనే లేదని.. కొందరు ప్రాంతీయ వాదులు సృష్టించిన పదమని.. ఇటీవల తెలంగాణకు చెందిన కీలక టీడీపీ నాయకుడు బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఉందో లేదో ఆయన చూశాడా? అని ప్రశ్నించారు.
తెలంగాణ వాదులను, తెలంగాణ సమాజాన్ని ఎవరూ అవమానించడానికి వీల్లేదని.. ప్రాంతాలు వేరైనప్పటికీ.. తెలుగు వారు అంతా ఒక్కటేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి వ్యాఖఖ్యలు చేయడం వల్ల.. ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వస్తుందని తెలిపారు.
పార్టీ పుట్టిందే అక్కడ!
తెలుగు దేశం పార్టీ.. పుట్టిందే తెలంగాణ గడ్డపై అని చంద్రబాబు గుర్తు చేశారు. 1982లో తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ ప్రకటించారని.. అప్పటికి ఆయన హైదరాబాద్ గడ్డపైనే ఉన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. తెలంగాణ కోసం టీడీపీ అనేక నిర్ణయాలు తీసుకుందన్నారు.
పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుచేసి.. తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించామన్నారు. అదేవిధంగా పలు ప్రాజెక్టులు నిర్మించి.. తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు తాగు, సాగునీటిని అందించిన ఘనత కూడా టీడీపీకే దక్కుతుందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను ఎన్టీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేసినందుకే ఇప్పుడు ఆ రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్‌కు కీలక పాత్ర ఉందన్నారు.
తన హయాంలో సైబరాబాద్ వంటి ఒక నగరాన్ని సృష్టించిన విషయాన్ని ప్రస్తావించారు. ఐటీ రంగానికి తెలంగాణను కేంద్రంగా మార్చామని.. ఇదంతా తెలంగాణ అభివృద్ధి కోసమే టీడీపీ ప్రభుత్వం నాడు అనేక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.
ఇప్పుడు తెలంగాణ గురించి కొందరు మాట్టాడి.. ఆ రాష్ట్రాన్ని.. టీడీపీని కూడా అవమానించేలా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణ కూడా తెలుగు ప్రజల సొత్తేనని చెప్పారు. అందరూ కలిసి ఉన్నారని.. తర్వాత వద్దనుకుని విడిపోయారని అంతమాత్రాన.. తెలంగాణపై విమర్శలు చేయడం సరికాదని తెలిపారు. రాజకీయాలు వేరు.. ప్రజల సెంటిమెంటు వేరని వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
ఇటీవల నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో తెలంగాణ నుంచి కూడా టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు మాట్టాడుతూ.. తెలంగాణపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నర్సింహులు.. తెలంగాణ అనే పదమే డిక్షనరీలో లేదని.. ఇది ప్రాంతీయ వాదులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకువచ్చిన నినాదమని.. కుటుంబాల కోసం పదవులు కట్టబెట్టుకున్నారని.. తెలంగాణ కంటే ఏపీనే మెరుగైన స్థానంలో ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా టీడీపీని ఇరుకున పెట్టాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు తెలంగాణ నాయకులను ఉద్దేశించి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on May 31, 2026 9:31 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…