పెద్ది ఇంకో వారం రోజుల్లో వచ్చేస్తున్నాడు. అయినా కూడా సోషల్ మీడియాలో పెద్దగా సౌండ్ లేదు. ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ జరుగుతున్నాయి కానీ అభిమానులు కోరుకునే కిక్ ఏదో వీటిలో మిస్సవుతోంది. దీనికి తోడు రామ్ చరణ్ మతిమరుపు, ఏమరుపాటు వల్ల మాట్లాడే కొన్ని మాటలు ట్రోలింగ్ మెటీరియల్ గా మారాయి. సరే ఇదంతా పెద్దగా డ్యామేజ్ చేసేది కాదనుకున్నా పుష్ప తరహాలో పెద్ది ఉత్తరాది ఆడియన్స్ లో హాట్ టాపిక్ గా మారలేకపోయిందనేది వాస్తవం.
చికిరి చికిరి పాట విడుదలైన టైంలో సిచువేషన్ ఇలా లేదు. ఎక్స్, ఇన్స్ టా హోరెత్తిపోయాయి. సాంగ్ గురించి ఫ్యాన్స్ నుంచి ఓ రేంజ్ లో ఎలివేషన్లు. లక్షల్లో రీల్స్ వచ్చి పడ్డాయి. రైరై రారయ్ కూడా బాగానే సౌండ్ చేసింది. కానీ ట్రైలర్, ఐటెం సాంగ్ హల్లెల్లేహల్లో మాత్రం ఆశించిన స్థాయిలో బజ్ పెంచలేకపోయాయి. రత్నవేలు, అవినాష్ కొల్ల నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే పెద్ది ఆషామాషీగా ఉండబోవడం లేదని అర్థమవుతోంది
ఇన్ సైడ్ టాక్ అయితే ఇదంతా తుఫాను ముందు ప్రశాంతతగా చెప్పుకుంటున్నారు. ఏదో ఒక హడావిడి చేయడం పెద్ద మ్యాటర్ కాదని, కంటెంట్ ఉన్న స్టార్ హీరో సినిమాకు ఎలాంటి బిల్డప్ అవసరం లేదని సమర్ధించుకుంటున్నారు. గతంలో సలార్, కల్కి లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ అతి ప్రచారం చేసుకోలేదని, కానీ పబ్లిక్ టాక్, రివ్యూస్ జనాన్ని ఆటోమేటిక్ గా థియేటర్లకు తీసుకొచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలా జరిగితే ఇంకా మంచిది.
నైజాం సింగల్ స్క్రీన్ పర్సెంటెజ్ వివాదం వల్ల పరిశ్రమ ఫోకస్ దాని మీదే ఉంది. పెద్దిని కొన్న బయ్యర్లు కూడా పర్సెంటెజ్ పంపకాల్లో ఏదైనా అనూహ్య మార్పు వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఓకే కానీ ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉంటుందనేది ఇంకా సమాచారం రాలేదు. హైదరాబాద్ లో అయినా చేస్తారో లేదో ముందే చెప్పేస్తే బెటర్. జూన్ 3 ప్రీమియర్ల గురించి కూడా ఇంకా క్లారిటీ లేదు. జిఓలు బయటికి వస్తే తప్ప ఈ మ్యాటర్ అంత ఈజీగా తేలదు.
This post was last modified on May 27, 2026 11:18 am
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…