Political News

గొడ్డలి పార్టీ నెవర్ అగైన్: చంద్రబాబు

ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం మంగళగిరిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతోంది. ఈ క్రమంలోనే తొలి రోజు మహానాడులో ప్రారంభోపన్యాసం చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది వాహనాల హోరు తగ్గిందని…కానీ, టీడీపీ కార్యకర్తల్లో జోష్ తగ్గలేదని చంద్రబాబు అన్నారు. అయితే, మహానాడు నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు వైసీపీ ఏదో ప్రెస్ మీట్ పెట్టిందని విమర్శించారు.

గొడ్డలి పార్టీని అడ్డుకోవాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిపై గొడ్డలి వేటు వేసిన వైసీపీ వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. పేదలకు కావాల్సింది సంక్షేమ పథకాలు అని.. గొడ్డలి వేట్లు కాదని… యువతకు కావాల్సింది ఉద్యోగాలని… గొడ్డలి పోట్లు కాదని అన్నారు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలని.. జంతు బలులు కాదని చెప్పారు. రక్త చరిత్ర రాసేవారు.. స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరని తెలిపారు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ సరికొత్త నినాదంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లారు.

అంతేకాదు, పార్ట్ టైం పాలిటిక్స్ వద్దని చంద్రబాబు హితవు పలికారు. అహంకారం, ఇగోలకు పోవద్దని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాసంబంధాలే ముఖ్యమని, అవే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త…ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047..హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ మన లక్ష్యం అని చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

This post was last modified on May 27, 2026 12:33 pm

Share

Recent Posts

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

10 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

27 minutes ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

4 hours ago

ఎన్టీఆర్… ఇలాగే ఉండాలి

తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…

4 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago