Movie News

అత్తవారింట్లో గన్ను పట్టిన బంగారం

శాకుంతలం, ఖుషి తర్వాత గ్యాప్ తీసుకున్న సమంత ఈసారి మా ఇంటి బంగారంగా రాబోతోంది. జూన్ 19 విడుదల కాబోతున్న ఈ సినిమాకు భర్త రాజ్ నిడిమోరు క్రియేషన్ బాధ్యతతో పాటు నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నారు. అన్నీ మంచి శకునములే ఫలితం నిరాశ పరిచాక దర్శకురాలు నందిని రెడ్డి కంబ్యాక్ కోసం ఎంచుకున్న సబ్జెక్టు ఇది. గతంలో ఈ కలయికలో ఓ బేబీ లాంటి సూపర్ హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిపారు.

కథను దాచలేదు. సంప్రదాయాలు, పట్టింపులు ఎక్కువగా ఉండే కుటుంబంలోకి కోడలిగా వస్తుందో యువతి (సమంత). వంట చేయడం కూడా రాని తనకో పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. గతం నీడలా వెంటాడుతూ ఆమె ఫ్యామిలీని ప్రమాదంలో నెట్టే పరిస్థితి రావడంతో తుపాకులు, కత్తులు బయటికి తీసి శత్రువులను ఊచకోత కోయడం మొదలుపెడుతుంది. అసలు ఆ ఊరికి ఎందుకు వచ్చింది, గతంలో తన వృత్తి ప్రవృత్తి ఏంటనేది తెరమీద చూసి తెలుసుకోవాలి.

అండర్ డాగ్ ఫార్ములా మాములుగా హీరోలకు వాడుతుంటారు. బాషా, ఇంద్ర నుంచి లియో దాకా ఎన్ని వచ్చాయో లెక్క చెప్పడం కష్టం. దీన్ని ఈసారి హీరోయిన్ కు అప్లై చేశారు. అంతర్జాతీయ మాఫియాలతో డీల్ చేసే ఒక డైనమిక్ లేడీ ఎందుకు ఆ చిన్న పల్లెటూరికి వచ్చింది, తన గతం ఎంత భయంకరంగా ఉంటుందోననే ప్రశ్నలు లేవనెత్తడంలో దర్శకురాలు నందిని రెడ్డి సక్సెస్ అయ్యారు. విజువల్స్ గట్రా చూస్తే బడ్జెట్ బాగానే పెట్టినట్టు ఉన్నారు.

తిరుపతి బ్యాక్ డ్రాప్, అక్కడి స్లాంగ్ తో సమంత స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. కొత్త కాకపోయినా ఇలాంటి శక్తివంతమైన క్యారెక్టర్ కు తన గొంతే వినిపించాలని కోరుకోవడం సంతోషించే విషయమే. సంతోష్ నారాయణన్ సంగీతంలో మంచి ఎలివేషన్ కుదరగా టెక్నికల్ టీమ్ పనితనం బాగానే రాబట్టుకున్నారు. పెద్ది వచ్చిన రెండు వారాల తర్వాత రిలీజవుతున్న మా ఇంటి బంగారంకు అదే రోజు దివానాతో పాటు వన్ వీక్ తర్వాత అఖిల్ లెనిన్ తో పోటీ ఉంటుంది. చూడాలి సామ్ కంబ్యాక్ ఎలా ఉంటుందో

This post was last modified on May 25, 2026 9:09 pm

Share

Recent Posts

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

1 hour ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

1 hour ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

2 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

3 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

4 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

4 hours ago