భోపాల్ లో జరగబోయే సాంగ్ లాంచ్ ఈవెంట్ కోసం పెద్ది బృందం రెడీ అవుతోంది. ఇప్పటికే కాస్ట్ అండ్ క్రూ కోసం నగరంలో రెండు వందల రూములు బుక్ చేసిన నిర్మాత కీలక సభ్యుల కోసం రెండు ప్రత్యేక విమానాలు అద్దెకు తీసుకున్నారట. లైటింగ్ సిస్టమ్ హైదరాబాద్ నుంచి, సౌండ్ సామాగ్రి ముంబై నుంచి ప్రత్యేకంగా తెప్పించారని సమాచారం. మొత్తం ఈవెంట్ ఖర్చు సుమారు నాలుగు కోట్ల దాకా అవుతుందని ఒక అంచనా. అంటే ఒక చిన్న బడ్జెట్ సినిమాతో సమానం.
వృద్ధి సినిమాస్ ఈ వేడుకని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ బ్యానర్ లో తొలి ప్యాన్ ఇండియా మూవీ అందులోనూ రామ్ చరణ్ హీరో కావడంతో ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ట్రైలర్ కు కొంచెం మిశ్రమ స్పందన రావడంతో పాటు ఓవర్సీస్ బుకింగ్స్ నెమ్మదించడం వల్ల చేతిలో ఉన్న రెండు వారాల్లో వీలైనంత బజ్ పెంచాల్సిన బాధ్యత బుచ్చిబాబు,పెద్ది బృందం మీద ఉంది. భోపాల్ ఈవెంట్ దానికి పెద్ద ఎత్తున సహకరిస్తుందని భావిస్తున్నారు.
ఏఆర్ రెహమాన్ లైవ్ గా ఇవ్వబోయే పెర్ఫార్మన్స్ మరో మెయిన్ హైలైట్ కానుందని చెప్పుకుంటున్నారు. ఎలాగూ ఐపీఎల్ కీలకమైన మ్యాచులన్నీ అయిపోయాయి కాబట్టి భారీ ఎత్తున వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. సభకు దాదాపు లక్ష మంది దాకా వస్తారని ఒక అంచనా. మొదటిసారి తమ ఊళ్ళో ఈ వేడుక జరగనుండటంతో భోపాల్ వాసులు స్వచ్చందంగా తరలి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అనుకున్న నెంబర్ రీచ్ అయితే మటుకు బయట ఈవెంట్స్ లో కొత్త రికార్డు అవ్వొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ఇంకా టైం ఉంది కాబట్టి భోపాల్ నుంచి వీలైనంత క్రేజీ కంటెంట్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జూన్ 4 వచ్చే ఓపెనింగ్స్ తోనే రికార్డులు బద్దలు కొట్టడం మొదలవుతుందనే ధీమాలో ఉన్నారు. ఏపీ తెలంగాణ నుంచి కూడా పలువురు ఫ్యాన్స్ భోపాల్ చేరుకున్నారు. పుష్ప ఈవెంట్ బీహార్ లో బ్లాక్ బస్టర్ అయినట్టు పెద్ది కూడా భోపాల్ లో కనక జెండా పాతితే ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భారీ రెవిన్యూ వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates