టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా కాలం తర్వాత డబ్బింగ్ సినిమాల డామినేషన్ కనిపిస్తోంది. గత వారం విడుదలైన వీరభద్రుడు వీక్ డేస్ లో నెమ్మదించినట్టు కనిపించినా హఠాత్తుగా వీకెండ్ నుంచి మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. మాస్ సెంటర్స్ లో ఫీడింగ్ తెస్తున్న మూవీగా బయ్యర్లు దీనికి మెయిన్ థియేటర్లు ఇచ్చి కొనసాగిస్తున్నారు. బ్రేక్ ఈవెన్ అయిపోయి ఆల్రెడీ లాభాల్లో ఉన్న ఈ డివోషనల్ కమర్షియల్ డ్రామా టాక్ తో సంబంధం లేకుండా హిట్టు స్టాంపు వేయించేసుకుంది.
ఇక దృశ్యం 3 మంచి నెంబర్లతో బోణీ చేసింది. మొదటి రెండు భాగాలతో పోలిస్తే అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ ముగింపు ఎలా ఉంటుందో చూడాలనే ఆత్రంతో ఉన్న ఆడియన్స్ వెంకటేష్ లేకపోయినా అనుకున్న దానికంటే పెద్ద సంఖ్యలో మొదటి రోజు థియేటర్లకు వచ్చారు. రిపోర్ట్స్, రివ్యూస్ ఆశాజకనకంగా లేకపోయినా ఉన్నంతలో డీసెంట్ క్రౌడ్స్ తో తెలుగుకు పెట్టిన హక్కులుగా చాలా వేగంగా రికవర్ చేసేలా ఉంది. పెట్తుబడి లెక్కలో ఇది ఫ్లాప్ కిందకు రాకపోవచ్చు.
మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్న డబ్బింగ్ సినిమాల సంగతి ఇలా ఉంటే మనవి మాత్రం చేతులు ఎత్తేస్తున్నాయి. ఇవాళ విడుదలైన అగ్లీ స్టోరీ, పురుషః, రమణి కళ్యాణం దేనికీ ఓపెనింగ్స్ పడలేదు. టాక్స్ గురించి జనాలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గత వారం కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. చిన్న సినిమాలు అందులోనూ కంటెంట్ పరంగా వీక్ ఉండటంతో మూడు నాలుగు వారాల నుంచి టాలీవుడ్ ఏ బాక్సాఫీస్ ఎదురీదుతూనే ఉంది.
పెద్ది జూన్ 4 వచ్చే దాకా ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. అందుకే ఎప్పుడెప్పుడు రెండు వారాలు గడిచిపోతాయా అని బయ్యర్లు కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. చాలా కేంద్రాల్లో జీతాలు, కరెంట్ బిల్లులు కూడా వర్కౌట్ కానంత వీక్ గా కొన్ని షోలు అసలు వేయడమే మానుకున్నారు. ఉన్నంతలో వీరభద్రుడు, దృశ్యం 3నే బండి లాగుతున్నాయి. ఊరికే హడావిడి చేసిన రీ రిలీజులు ఆంధ్రావాలా, ఊసరవెల్లి, కృష్ణ సైతం చేతులు ఎత్తేశాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates