Movie News

నానికి పోటీగా దుల్కర్ సల్మాన్

ఆగస్ట్ 21 విడుదల కాబోతున్న నాని ప్యారడైజ్ కి పోటీ వెళ్లేందుకు పేరున్న సినిమాలు సాహసం చేయకపోవచ్చనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో క్రమంగా లెక్కలు మారుతున్నాయి. అది వచ్చిన వారం రోజులకే శర్వానంద్ భోగి ఆల్రెడీ కర్చీఫ్ వేయగా ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డేని టార్గెట్ చేసుకుని జైలర్ 2, విశ్వంభర, స్వయంభు లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ఒకటో రెండో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు.

దుల్కర్ సల్మాన్ ఐ యాం గేమ్ ఆగస్ట్ 20 రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే కేవలం ఒక్క రోజు గ్యాప్ అన్న మాట. అయితే తెలుగు రాష్ట్రాల వరకు నానికి ఇబ్బంది లేదు కానీ కేరళ, తమిళనాడులో ఖచ్చితంగా కాంపిటీషన్ అవుతుంది. ఎందుకంటే ఐ యాం గేమ్ పేరుకి ఇంగ్లీష్ టైటిల్ అయినా ట్రేడ్ వర్గాల్లో దీని మీద చాలా క్రేజ్ ఉంది. దర్శకుడు నిహస్ హిదాయత్ మొన్న ఏడాది ఆర్డిఎక్స్ రూపంలో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఐ యాం గేమ్ ని ప్యాన్ ఇండియా స్థాయిలో హిందీతో కలిపి రిలీజ్ చేస్తున్నారు. అయితే నాని ఉన్నాడని తెలిసి కూడా దుల్కర్ ఈ ఆప్షన్ ఎంచుకోవడం చూస్తుంటే బిజినెస్ కొంచెం తగ్గినా పర్లేదు మంచి డేట్ ని వదులుకోకూడదనే ఉద్దేశం కనిపిస్తోంది. ఇక ప్యారడైజ్ విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ప్రసక్తే లేదనే సంకల్పంతో పరుగులు పెడుతున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భారీ షెడ్యూల్స్ ని అనుకున్న టైంకే పూర్తి చేస్తారట.

ఆల్రెడీ రెండు డేట్లు మార్చుకున్న ప్యారడైజ్ ఇక మాట తప్పడానికి లేదు. కయదు లోహర్ హీరోయిన్ గా మోహన్ బాబు విలన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో హీరో పాత్ర గురించి ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే షాకింగ్ ట్విస్టులు వినిపిస్తున్నాయి. అదే కనక నిజమైతే మటుకు ఈ జనరేషన్ హీరోల్లో ఎవరూ చేయని రిస్క్ నాని చేసినట్టు అవుతుంది. అదేంటనేది తర్వాత బయట పడుతుంది కానీ ప్యారడైజ్ నుంచి రెండో పాట అతి త్వరలో రానుంది.

This post was last modified on May 20, 2026 10:26 pm

Share

Recent Posts

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

35 minutes ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

49 minutes ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

2 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

2 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

2 hours ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

3 hours ago