కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ భాస్కర్ వంద కోట్ల గ్రాస్ అందుకున్నప్పటికీ, అదే టైంలో ఒకేసారి రిలీజైన కిరణ్ అబ్బవరం క, శివ కార్తికేయన్ అమరన్ వల్ల ఇంకా రావాల్సిన పెద్ద రెవిన్యూ ఒక మార్కు దగ్గరే ఆగిపోయిందని మూవీ లవర్స్ సైతం ఒప్పుకుంటారు. ఎందుకంటే అపోజిషన్ మూవీస్ కు కూడా పాజిటివ్ టాక్ రావడం దీనికి కారణంగా చెప్పొచ్చు.
గుంటూరు కారం మరీ తీసేయదగ్గ సినిమా కాకపోయినా హనుమాన్ కాంపిటీషన్, దాని చుట్టూ నడిచిన క్యాంపైన్ వల్ల యావరేజ్ పైన ఉండాల్సిన మహేష్ బాబు చిత్రం కొన్ని ఏరియాల్లో ఫ్లాప్ అనిపించుకోవాల్సి వచ్చిందని బయ్యర్లు గుర్తు చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతికి వస్తున్నాం వల్లే డాకు మహారాజ్ పూర్తి పొటెన్షియల్ బయట పడలేదు. రేపు విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కు కూడా ఈసారి అలాంటి క్లాషులు ఉన్నాయి. కాకపోతే గతంలో జరిగినట్టుగా అవతలి వాళ్ళ వల్ల ప్రభావితం చెందే టెన్షన్ నాగవంశీకి ఉండదని వాతావరణం చెబుతోంది.
ఎందుకంటే విశ్వనాథ్ అండ్ సన్స్ వీరభద్రుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తోంది. సూర్య ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు పుష్కలంగా ఉంటుంది. మకుటం, అగధ, పళ్లబురుసు మొదలైనవి ఎదురుగా ఉన్నా అవేవి బడ్జెట్, స్కేల్, బిజినెస్, హైప్ లో విశ్వనాథ్ కు దగ్గరగా ఉన్నవి కావు. పైగా బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే సూర్య పై చేయి నిన్నటి నుంచే ఉన్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మిగిలింది టాక్ రావడమే.
దర్శకుడు వెంకీ అట్లూరి బ్రాండ్ తో పాటు మమిత బైజు, రాధికా శరత్ కుమార్ రూపంలో ఫిమేల్ క్యారెక్టర్లు, సూర్య కొడుకుగా నటించిన చిన్న పిల్లాడి సెంటిమెంట్, వీటికి తోడు సూర్య పాజిటివ్ వైబ్ ఇవన్నీ విశ్వనాథ్ అండ్ సన్స్ కు పెద్ద ప్లస్ ఆవుతున్నాయి. కంటెంట్ కనెక్ట్ అయ్యిందా పికప్ చాలా వేగంగా ఉంటుంది. లెనిన్, కొరియన్ కనకరాజు, డిసి లాంటి యాక్షన్ కంటెంట్ చూశాక విశ్వనాథ్ లాంటి కూల్ కుటుంబ కథలు ఫ్రెష్ గా అనిపిస్తాయి. మెప్పిస్తే మాత్రం వసూళ్లకు ఏ ఢోకా ఉండదు.
This post was last modified on August 13, 2026 2:11 pm
ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…
టాలీవుడ్ మెగాస్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడటం అరుదు. ఆ మధ్య భోళా శంకర్, జైలర్…
అల్లరి నరేష్ కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌కు ‘నాంది’ శుభారంభం పలికినా.. ఆ తర్వాత అతను నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలందుకోలేరు.…
ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన దగ్గర్నుంచి ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకులకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ఇందులో నాని…
ప్రభాస్ దర్శకుల ఎంపిక ఎప్పుడూ ఒకే లెక్కలో ఉండదు. తన మార్కెట్‌కు సరిపోయే టాప్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలని ఎప్పుడూ…
టాలీవుడ్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కూడా చాలామంది గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. హిట్టు కోసం ప్రయత్నం ఆపట్లేదు.…