Movie News

సమంత.. అఖిల్… అప్పటిదాకా సైలెంటే

వచ్చే నెల నుంచి ఇమేజ్ ఉన్న హీరో హీరోయిన్ల సినిమాలు వరసగా రాబోతున్నాయి. పెద్ది జూన్ 4 చేయబోయే రికార్డుల వేట గురించి అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఇప్పటికే విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. అయితే ఇది కాకుండా మరో రెండు ముఖ్యమైన రిలీజులు వసూళ్ల పరంగా ఆశలు రేపుతున్నాయి. ఒకటి మా ఇంటి బంగారం. రెండు లెనిన్. పరస్పరం తలపడనప్పటికీ వారం గ్యాప్ సరిపోదేమోనని అభిమానులు భావిస్తున్నారు. సరే ఇక్కడి దాకా బాగానే ఉంది.

కానీ ప్రమోషన్ల విషయంలో రెండు సినిమాలు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నాయి. కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం ఐపీఎల్ పీక్స్ కు చేరుకుంటోంది. సెమి ఫైనల్స్ మొదలకాబోతున్నాయి. ఇంకోవైపు పెద్ది సౌండ్ పెంచడానికి రెడీ అయ్యింది. ట్రైలర్ కి ఊహించని విధంగా మిశ్రమ స్పందన రావడంతో పబ్లిసిటీ గేరు మార్చేందుకు టీమ్ నిర్ణయం తీసుకుంది. బజ్ పరంగా టెన్షన్ లేదు కానీ ఉత్తరాది మార్కెట్లో ఓపెనింగ్స్ రావాలంటే ముందస్తు హైప్ చాలా అవసరం.

ఇక మా ఇంటి బంగారం విషయానికి వస్తే జూన్ 19 మంచి డేట్. అప్పటికి పెద్ది మూడో వారంలో ఉంటుంది కాబట్తి ఖంగారేం అవసరం లేదు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు ఫైట్లు యాక్షన్ ఎపిసోడ్లు గట్రా గట్టిగానే పెట్టారు. రెగ్యులర్ ఫార్ములాతో కాకుండా డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో ఉంటుందని తెలిసింది. ఇక లెనిన్ సంగతి తెలిసిందే. పలు వాయిదాల తర్వాత జూన్ 26 లాక్ చేసుకుంది.

ఇది కూడా ఆషామాషీ ప్రచారంతో పనయ్యే బొమ్మ కాదు. అఖిల్ కి ఖచ్చితంగా బ్రేక్ దక్కాలనే టార్గెట్ తో నాగార్జున స్వయంగా సితార సంస్థతో చేతులు కలిపి అన్నపూర్ణ స్టూడియోస్ ని భాగస్వామిగా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ కు తక్కువ కాకూడదనే ఉద్దేశంతో దర్శకుడు మురళికిషోర్ అబ్బూరుకి అనుభవం తక్కువైనా ఫ్రీడమ్ ఇచ్చారు. కాంపిటీషన్ తక్కువే కాబట్టి టాక్ పాజిటివ్ గా తెచ్చుకుంటే మంచి ఫలితం డ్ దక్కుతుంది. జూన్ రెండో వారంలో ప్రమోషన్లకు తెరతీయబోతున్నారు.

This post was last modified on May 20, 2026 10:30 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago