Movie News

నగల కంటే అందంగా తమన్నా గ్లామర్ ట్రీట్

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది. బ్లూ కలర్ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర పోజులిస్తూ కుర్రకారుకు షాక్ ఇస్తోంది. సొంత జువెలరీ బ్రాండ్ తమన్నా ఫైన్ జువెలరీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ పిక్స్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మెడలో మినీ ఫ్లిక్ చైన్ తో అదరగొడుతున్న ఈ భామ గ్లామర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ చైన్ కు ఐదు వందలకు పైగా వజ్రాలు పొదిగిన ఆ నగ కన్నా తమన్నా అందమే ఫొటోల్లో ఎక్కువగా హైలైట్ అవుతోంది.

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా తమన్నా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. రోజురోజుకు మరింత యంగ్ గా కనిపిస్తూ ఇప్పటి తరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఫిట్నెస్ విషయంలో తీసుకునే జాగ్రత్తలే ఈ అందానికి అసలు కారణం అని చెప్పొచ్చు. కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి క్యూట్ లుక్స్ తో ఉందో ఇప్పుడు కూడా అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజా ఫోటోల్లో మత్తుగా చూస్తున్న ఎక్స్ ప్రెషన్స్ కు సోషల్ మీడియాలో లైకుల వర్షం కురుస్తోంది.

గత కొంతకాలంగా తమన్నా కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ కే పరిమితమైన ఈ బ్యూటీ, ఇప్పుడు నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన వెబ్ సిరీస్ లు కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చాయి. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. సౌత్ సినిమాల కన్నా ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్టుల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు లైనప్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది.

This post was last modified on May 20, 2026 10:11 pm

Page: 1 2

Share

Recent Posts

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

50 minutes ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

2 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

3 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

3 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

3 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

4 hours ago