Movie News

ప్రశాంత్ నీల్ నమ్మకం నిలబడిందా

నిన్న అర్ధరాత్రి విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ నాలుగు నిమిషాల టీజర్ సోషల్ మీడియాని కమ్మేసింది. విపరీతమైన అంచనాల నేపథ్యంలో దీన్ని రాగానే చూడాలనే కోరికతో తారక్ అభిమానులతో పాటు రెగ్యులర్ మూవీ లవర్స్ సైతం మిడ్ నైట్ అని చూడకుండా ఎదురు చూశారు. కథా నేపథ్యం, పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్న నీల్ అసలైన హీరో విజువల్స్ రెండు మూడు షాట్స్, డైలాగులకు పరిమితం చేయడం ముందు ఊహించినట్టే జరిగింది.

అయితే ఇక్కడితో అయిపోలేదు. మొన్న పెద్ది లాగే ఇప్పుడు డ్రాగన్ కు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్, సలార్ ఛాయల్లోనే దీన్ని కూడా తెరకెక్కించిన వైనం స్పష్టం. కానీ ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని ఓపియం మాఫియా, ఆఫ్గనిస్తాన్ క్రైమ్ వరల్డ్, గోల్డెన్ ట్రయాంగిల్ సామ్రాజ్యం తదితరాలు కొత్తగా ఉన్నాయి. కాకపోతే నీల్ తనకు అలవాటైన డార్క్ అండ్ వయొలెంట్ టోన్ లో చూపించడం రెగ్యులర్ ఆడియన్స్ తో జస్ట్ ఓకే అనిపించుకుంది.

మరో సమస్య ఏమిటంటే మొదటి రెండు నిమిషాల్లో ఏఐ ఎక్కువగా వాడారు. జనం గుర్తుపట్టేలా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఉద్దేశం వేరు. స్టోరీ బ్యాక్ డ్రాప్ ని ముందే పరిచయం చేసే ఉద్దేశంతో ఆ ఫుటేజ్ కట్ చేయించారు. అయితే విఎఫ్ఎక్స్ లో మరింత క్వాలిటీ ఉంటే బాగుండేది. తర్వాత వచ్చే విజువల్స్ చాలా రిచ్ గా, రియలిస్టిక్ గా ఉన్నాయి. లూగర్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో సలార్ లో ప్రభాస్ పోలికలు వచ్చేలా ఉండటం ఒకరకంగా రిస్క్ అయిపోయింది.

ఇంకా సినిమా విడుదలకు ఏడాది ఉంది. షూటింగ్ సగం కూడా అవ్వలేదు. చాలా సమయం చేతిలో ఉంది కనక ప్రశాంత్ నీల్ కు ఆన్ లైన్ లో వస్తున్న ఫీడ్ బ్యాక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తనతో పాటు తారక్ ని వినూత్నంగా ఆవిష్కరించడానికి నీల్ కి ఇదో మంచి ఛాన్స్. గత బ్లాక్ బస్టర్ల షేడ్స్ కనిపించకుండా కొత్తగా చూపిస్తే రికార్డుల పరంగా అద్భుతాలు జరిగిపోతాయి. మరో కీలకమైన కంటెంట్ ప్రమోషన్ రూపంలో బయటికి రావాలంటే ఇంకో అయిదారు నెలలు చూడాల్సిందే.

This post was last modified on May 20, 2026 10:51 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

3 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago