Movie News

భావోద్వేగాల ఆటలో ‘పెద్ది’ విధ్వంసం

మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు, ఫ్లడ్ లైట్లు వేసుకుని ఎదురు చూస్తున్న పెద్ది ట్రైలర్ వచ్చేసింది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో పాటు ఇతర క్యాస్ట్ అండ్ క్రూ హాజరు కాగా మీడియా ముందు ఆవిష్కరించారు. జూన్ 4 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి కళ్ళు ఈ వీడియో మీదే ఉన్నాయి. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న అంచనాలని మరింత పెంచేందుకు ఇదే కీలకం కానుంది. ఈసారి స్టోరీ దాచకుండా చెప్పేశారు.

విజయనగరంలోని ఒక కొండప్రాంతం కింద ఉండే ఊరు పెద్ది (రామ్ చరణ్)ది. క్రికెట్, రన్నింగ్ రేస్, కుస్తీ ఆట ఏదైనా సరే గెలవడం తప్ప ఓడటం తెలియని మొండోడు. జనాన్ని కూలీలుగా మార్చి బానిసల్లా చూసే పెద్దోళ్లను ఎదిరించే పరిస్థితి పెద్దికి వస్తుంది. దీని వల్ల పోలీసులు ఊరి మీద పడి భీభత్సం చేస్తారు. దీంతో పెద్దికి ఢిల్లీ వెళ్లే కఠిన సవాల్ ఎదురవుతుంది. అసలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేసిన ప్రయాణంలో పెద్ది ఏమేం చేశాడో తెలియాలంటే ఇంకో పదిహేను రోజులు ఆగాలి.

రామ్ చరణ్ రియల్ స్టామినాని బుచ్చిబాబు రెట్టింపు స్థాయిలో పిండేసుకున్నారు. ఎమోషన్స్, యాక్షన్, ఫైట్స్ దేనికవే విపరీతమైన హైప్ పెంచేలా ఉన్నాయి. 1980 వాతావరణాన్ని పునః సృష్టించిన తీరు అద్భుతంగా ఉంది. జాన్వీ కపూర్ గ్లామర్ షోని బాగా వాడేశారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యెందు, బోమన్ ఇరానీ తదితరులను రెండు మూడు షాట్స్ లో పరిచయం చేశారు. సింపుల్ గా చెప్పాలంటే పెద్ది పూర్తిగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షోలాగా సాగిపోయింది.

టెక్నికల్ గా మాట్లాడుకుంటే పెద్దికి ఏఅర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం ఎంత పెద్ద దన్నుగా నిలబడనున్నాయో మూడు నిమిషాల కంటెంట్ లో స్పష్టంగా బయట పడింది. ముఖ్యంగా యాభై సంవత్సరాల వెనుకటి వింటేజ్ వైబ్స్ మళ్ళీ రీ క్రియేట్ చేయడం, దానికి తగ్గ బీజీఎమ్ కుదరడం పెద్ద ప్లస్ అయ్యాయి. దర్శకుడు బుచ్చిబాబు తన మీద పెట్టుకున్న నమ్మకానికి గ్యారెంటీ కార్డులా ఈ ట్రైలర్ ఉపయోగపడటంతో ఇక జూన్ 4 ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో చూడాలి.

This post was last modified on May 18, 2026 4:49 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

2 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

3 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

3 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

4 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

6 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

7 hours ago