ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ పై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ‘డ్రాగన్’ అని హింట్ ఇచ్చినా ఇంకా పోస్టర్ ద్వారా చెప్పలేదు. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజున అన్ని లెక్కలు తేల్చేలా ఉన్నాడు నీల్. ఇక 4 నిమిషాల 35 సెకన్ల గ్లింప్స్ వస్తుందని ఒక టాక్ గట్టిగా వస్తోంది. ఒకవేళ నిజంగా ఇదే నిడివితో గ్లింప్స్ వస్తే, అది ఫ్యాన్స్‌కి ట్రీట్ మాత్రమే కాదు. కాంపిటీటర్స్‌కి నీల్ ఇస్తున్న వార్నింగ్ కూడా.
నా వరల్డ్ ఇది, నా హీరో ఇలా ఉంటాడు, మీ లెక్కలు ఇక్కడ పనిచేయవు.. అని 4 నిమిషాల 35 సెకన్లలో చెప్పేస్తాడని అర్ధమవుతుంది. ‘కేజీఎఫ్’ టైమ్‌లో రాకీ భాయ్‌ని, ‘సలార్’ టైమ్‌లో దేవాని పరిచయం చేసిన స్టైల్ ఇదే. ముందు వరల్డ్ బిల్డ్ చేసి, ఆ వరల్డ్‌ని షేక్ చేసే హీరోని చివర్లో దింపుతాడు. ఈ లెంగ్త్ వెనక లాజిక్ ఉంది. నీల్ సినిమా అంటే ఒక డార్క్ యూనివర్స్. ‘డ్రాగన్’ మాఫియా బ్యాక్‌డ్రాప్ అని టాక్.
ఆ వరల్డ్ రూల్స్, గ్యాంగ్స్, వయలెన్స్ లెవెల్ ఏంటో 45 సెకన్లలో చూపించలేం. ఎన్టీఆర్ ట్రాన్స్‌ఫర్మేషన్ డౌట్స్ కూడా క్లియర్ చేయాలి. లీక్డ్ పిక్స్‌లో లీన్ లుక్ కనిపించింది. కానీ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, వాకింగ్, ఫైట్ మూమెంట్ చూపించాలంటే టైమ్ కావాలి. అందుకే ట్రైలర్ లెంగ్త్‌తో గ్లింప్స్ ప్లాన్ చేస్తున్నారని బజ్. ‘కేజీఎఫ్ 2’ టీజర్ కూడా అప్పట్లో పెద్దదే. ‘సలార్’ టీజర్ 1 కూడా మినీ ట్రైలర్ ఫీల్ ఇచ్చింది.
నీల్ కంటెంట్ డిమాండ్ చేస్తే రన్‌టైమ్ గురించి ఆలోచించడు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా నీల్‌కి ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకే మే 20 డేట్ టార్గెట్ చేసి, బర్త్‌డే ట్రీట్‌తో పాటు అంచనాల విషయంలో ఒక స్టేట్‌మెంట్ ఇవ్వాలని చూస్తున్నాడు.
ఇక్కడే అసలు రిస్క్ ఉంది. గ్లింప్స్ 4 నిమిషాల 35 సెకన్లు అయితే ట్రైలర్‌కి ఏం మిగులుతుంది? ఎక్కువ రివీల్ చేస్తే క్యూరియాసిటీ చచ్చిపోతుంది. కానీ నీల్ బ్యాలెన్స్ తెలిసిన డైరెక్టర్. వరల్డ్ చూపిస్తాడు, హీరో ఎలివేషన్ ఇస్తాడు, కానీ కథ ప్లాట్ టచ్ చేయడు. ఇది ఇంకా శాంపిల్ మాత్రమే అనే ఫీలింగ్ ఇస్తాడు. అదే అతని కట్. చూడాలి మరి ఇలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో.
Gulte Telugu Telugu Political and Movie News Updates