Movie News

ట్రైలర్ డే… హీట్ పెంచే తీరాలి పెద్ది

ఇవాళ పెద్ది ట్రైలర్ రానుంది. మధ్యాన్నం ముంబైలో మూడు గంటలకు జరిగే ఈవెంట్ లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ మొన్నే అక్కడికి చేరుకోగా మిగిలిన సభ్యులు అందుబాటులోకి వచ్చేశారు. జాన్వీ కపూర్ ఉండేది అక్కడే కాబట్టి ఇబ్బంది లేదు. మూడు నిమిషాల సుదీర్ఘమైన ట్రైలర్ మీద అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అందులోనూ కొందరు మీడియా ప్రతినిధులు ముందే చూసేసి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చారు.

నిజంగా దానికి తగ్గట్టు ఉంటే మాత్రం బ్లాస్ట్ అవుతుంది. హిందీ మార్కెట్ దీని మీద ఆధారపడి ఉంది. సీక్వెల్ కాదు కాబట్టి పుష్పకు దక్కిన అడ్వాంటేజ్ పెద్దికి లేదు. అందులోనూ గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడం ఎంతో కొంత అక్కడి జనాల్లో ప్రభావం చూపిస్తోంది. దాన్ని పూర్తిగా చెరిపేయాలంటే పెద్ది ట్రైలర్ అదిరిపోవడం అవసరం. కంటెంట్ కరెక్ట్ గా కుదిరి నార్త్ ఆడియన్స్ లో నమ్మకం వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ బాగుంటాయి. ఎలాగూ పెద్దగా పోటీ లేదు కాబట్టి.

అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్ప్స్ వస్తుంది కనక ఆలోగానే పెద్ది ట్విట్టర్, ఇన్స్ టా తదితర మాధ్యమాలను ముంచెత్తడం ఖాయం. అసలే రెండు మూడు వాయిదాల తర్వాత వస్తున్న రామ్ చరణ్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. అందులోనూ బుచ్చిబాబు ఇంటర్వ్యూలు చూసిన తర్వాత అవి మరింత పెరిగాయి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వాళ్ళలో చాలా బలంగా కనిపిస్తోంది.

రిలీజ్ ఇంకో పదిహేను రోజులు మాత్రమే ఉండటంతో పవర్ ప్లే పేరుతో చేస్తున్న ప్రమోషన్లు పీక్స్ కు చేరుకోబోతున్నాయి. ఇరవై రెండున ఆర్సిబితో సన్ రైజర్స్ ఆడే మ్యాచ్ ని కూడా వాడుకోబోతున్నారు. రామ్ చరణ్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఊర మాస్ జాన్వీ పాత్ర, మైండ్ బ్లాంక్ చేసే చివరి షాట్ తదితర విశేషాలతో పెద్ది ట్రైలర్ చేయబోయే విధ్వంసం మాములుగా ఉండేలా లేదు. సాయంత్రం నాలుగు గంటలకు ఆన్ లైన్ రిలీజ్ ఉండొచ్చు.

This post was last modified on May 18, 2026 10:41 am

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

30 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

58 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

12 hours ago