Movie News

విజయ్ లేకపోవడమే సూర్యకు ప్లస్సయ్యింది

తమిళనాడులో విజయ్ సిఎం అయ్యారు. రజనీకాంత్ నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. కమల్ హాసన్ వేగం తగ్గిపోయింది. అజిత్ కారు రేసులంటూ వేరే ప్రపంచంలో ఉంటున్నారు తప్పించి సెట్స్ లోకి వెళ్దాం, కథలు విందామనే ధ్యాసలో లేరు. అదిగో ఇదిగో అంటున్నారు తప్పించి కొత్త ప్రాజెక్టు మొదలుకాలేదు. శివ కార్తికేయన్ ఒక అడుగు ముందుకు అయిదు అడుగులు వెనక్కు వెళ్తున్నాడు తప్పించి స్థిరమైన హిట్లు లేవు. అందులోనూ తనది మాస్ కటవుట్ కాదు.

ఈ నేపథ్యం సూర్యకి కలిసి వచ్చేలా ఉందని కోలీవుడ్ భావిస్తోంది. ఎందుకంటే కరుప్పు (వీరభద్రుడు) ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. మొదటి వీకెండ్ లోనే 100 కోట్ల మార్క్ దాటెయ్యడమమంటే చెప్పుకోదగిన విషయమే. ఒక రోజు ఆలస్యంగా విడుదలైనా, షోలు క్యాన్సిల్ కావడం లాంటివి ప్రేక్షకులను చికాకు పెట్టినా ఫైనల్ గా సినిమా జనం ముందుకు వచ్చింది. యునానిమస్ రివ్యూస్ రాలేదు. పబ్లిక్ టాక్ కూడా యావరేజ్ కి కిందా మీదా ఉంది. అయినా సరే వసూళ్లు బాగుండటం చూస్తుంటే మాస్ ఎంత ఆకలి మీద ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

బాక్సాఫీస్ దగ్గర ఏర్పడిన గ్యాప్ ని పక్క రాష్ట్రంలోనే కాదు ఏపీ తెలంగాణలో కూడా సూర్య వాడుకుంటున్న వైనం స్పష్టం. ఉస్తాద్ భగత్ సింగ్ తప్పించి గత మూడు నెలల్లో ఒక్క స్టార్ హీరో సినిమా లేకపోవడంతో ఇక్కడ పరిస్థితిని బాగా కిందకు తీసుకెళ్లింది. దీంతో డబ్బింగ్ బొమ్మ అయినా సరే మనోళ్లు కరుప్పుకి ఓటేశారు. అయితే ఈ జోరు వీకెండ్ వరకే పరిమితమవుతుందా లేక హోల్డ్ చేసుకుని హిట్టు కొడుతుందా అనేది వేచి చూడాలి.

ఇప్పుడప్పుడే విజయ్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు. ఓడిపోయి ఉంటే రెండు మూడు చేసేవాడేమో కానీ ముఖ్యమంత్రి కాబట్టి నో మూవీస్. పైగా ఇకపై మేకప్ వేసుకోనని ఎప్పుడో ప్రకటించాడు కూడా. ఈ అవకాశాన్ని సూర్య కనక సరైన సినిమాలతో వాడుకుంటే సాలిడ్ కంబ్యాక్ ఇవ్వొచ్చు. రొటీన్ కథలతో వస్తే మళ్ళీ రిస్క్ లో పడటం ఖాయం. టాలీవుడ్ చాలా బెటర్ అనుకోవాలి. మన దగ్గర వందల కోట్ల నుంచి మినిమమ్ మార్కెట్ ఉన్న మాస హీరోలు పది దాకా ఉంటారు.

This post was last modified on May 18, 2026 9:03 am

Share

Recent Posts

బిసి సెంటర్స్‌లో ‘రిపీట్’ కావడం లేదా

మొన్న శుక్రవారం విడుదలైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ అంచనాలకు మించి హైదరాబాద్, ఓవర్సీస్ లో అదరగొడుతోంది. వసూళ్లు ఊహించిన…

2 hours ago

ఓమ్‌లో ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయో

టాక్ మిశ్రమంగా ఉన్నా ఓమ్ వసూళ్లు బాగున్నాయి. వీకెండ్ తర్వాత ఎంత శాతం డ్రాప్ ఉంటుందనేది రెండు రోజులు ఆగితే…

3 hours ago

భోగి మంటల్లో శత్రువుల దహనం

టాలీవుడ్ తెరమీద రక్తధారలు కొనసాగుతున్నాయి. హీరోలు మారుతున్నా వయొలెన్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కాసులు కురిపించే దిశగా ప్రేక్షకులు ముందుకు…

4 hours ago

యూపీ సీఎంలా పాలిస్తానంటున్న ఏపీ స్వామీజీ

ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ ఓ స్వామీజీ కూడా ఎన్నిక‌ల రంగంలోకి దిగారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా మడకశిర నియోజ‌క‌వ‌ర్గంలోని…

4 hours ago

జ‌గ‌న్ ప‌ట్టు.. ష‌ర్మిల పంతం.. ముదిరిన ప్యాలెస్ వివాదం!

త‌న కుమార్తె అంజ‌లి పెళ్లిని బెంగ‌ళూరులోని య‌ల‌హంక ప్యాలెస్‌లో చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల పంతం ఒక‌వైపు..…

5 hours ago

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో `ప‌ట్టింపు` లేదు.. ఎవ‌రైనా పోటీ చేయండి: జ‌న‌సేన‌

ఏపీలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల కోలాహ‌లం జ‌రుగుతున్న క్ర‌మంలో జ‌న‌సేన పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో ఎలాంటి…

5 hours ago