విశ్వక్ సేన్ హడావిడి కనిపించడం లేదే

మాములుగా విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్లో అయినా బయట అయినా హుషారుగా చలాకీగా ఉంటూ వెంటనే తన ఉనికి తెలిసేలా ప్రవర్తిస్తుంటాడు. ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో అది బయట పడింది. అయితే గత ఏడాది లైలా డిజాస్టర్ అయ్యాక మళ్ళీ హిట్టు కొట్టిన తర్వాతే బయట కనిపిస్తానని చెప్పిన విశ్వక్ అన్నట్టుగానే ఫంకీ విడుదల వరకు అజ్ఞాతవాసంలో ఉండిపోయాడు. తీరా చూస్తే అది కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఓటిటిలోనూ సోసో రెస్పాన్స్ తెచ్చుకుంది.

తర్వాత కొన్ని వారాలు కనిపించలేదు కానీ కల్ట్ టీజర్ ఈవెంట్ లో తిరిగి హడావిడి చేశాడు. అక్కడ కూడా ఫంకీ గురించి పాజిటివ్ గా మాట్లాడి షాక్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా విశ్వక్ నుంచి కల్ట్ కాకుండా లెగసి అనే మరో మూవీ నిర్మాణంలో ఉంది. మొదటిది యాక్షన్ మూవీ కాగా రెండోది పొలిటికల్ థ్రిల్లర్. ఒకదానికి మరొకటి సంబంధం లేని జానర్లు. అయితే ఫ్యామిలీస్ టార్గెట్ చేయకుండా విశ్వక్ ఎక్కువగా మాస్, యూత్ నే లక్ష్యంగా పెట్టుకుంటున్నాడు.

నిజానికి విశ్వక్ సేన్ మీద కుటుంబ కథలను వర్కౌట్ చేయొచ్చని అశోకవనంలో అర్జున కల్యాణం ఋజువు చేసింది. అలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటే జనాల్లో కనెక్టివిటీ పెరుగుతుంది. అందుకే ఇటీవలే కొరటాల శివ నిర్మాణంలో రజత్ రవిశంకర్ దర్శకత్వంలో ఒక రామ్ కామ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సరే విశ్వక్ ఆలోచనలు ఎలా ఉన్నా ఫ్లాప్ ప్రభావం నుంచి వీలైనంత త్వరగా బయటపడి వరస రిలీజులు ఉండేలా చూసుకోవాలి. కల్ట్ ముందు వచ్చే ఛాన్స్ ఉంది కానీ లెగసి కూడా కీలక భాగం అయిపోయిందని అంటున్నారు. అప్డేట్స్ అయితే లేవు.

దర్శకుడిగా కూడా కల్ట్ తో విశ్వక్ సేన్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అసలే హిట్ 3 లాంటి కాన్సెప్ట్ తీసుకుని హింసకు ప్రాధాన్యం ఇస్తున్న విశ్వక్ ఈసారి హిట్టు కొట్టే తీరాలి. ఆఫర్లకు ఢోకా లేకపోయినా, వరసగా సినిమాలు వస్తున్నా సక్సెస్ ఎక్కువ కాలం లేకపోతే మార్కెట్ రిస్క్ లో పడుతుంది. విశ్వక్ సేన్ దానికి దగ్గరలో ఉన్నాడు. వీలైనంత త్వరగా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే. మరి ఇంగ్లీష్ పేర్లు పెట్టుకున్న రెండు సినిమాల్లో ఏది తొలి బ్రేక్ ఇస్తుందో చూడాలి.