జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు. తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్లే దూరంగా ఉందని, రెమ్యునరేషన్ భారీగా ముట్టింది కాబట్టి కెమెరా ముందుకు రావడం లేదని రకరకాలుగా అల్లేస్తున్నారు. అయితే ఇన్ సైడ్ టాక్ వేరేలా ఉంది. పెద్ది హీరో సెంట్రిక్ మూవీనే అయినప్పటికీ హీరోయిన్ కు తగినంత ప్రాధాన్యం ఉండేలా బుచ్చిబాబు కేర్ తీసుకున్నారట.
కాకపోతే కథకు సంబంధించి ఒక ముఖ్యమైన ట్విస్టు తనతోనే ముడిపడి ఉంటుందని, ఎమ్మెల్యే కూతురిగా ఆ అమ్మాయి స్టోరీని మలుపు తిప్పే విధానం షాక్ కు గురి చేయడం ఖాయమని అంటున్నారు. అదే నిజమైతే రంగస్థలం తరహాలో అదిరిపోయే స్క్రీన్ ప్లే ఇందులోనూ చూడొచ్చు. కొన్ని బ్లాక్స్ చాలా ఇంటెన్స్ గా ఉంటాయని, ఒకదాంట్లో జాన్వీ కపూరే కీలకమని అంటున్నారు. ఇది నిజమైతే మెగా ఫ్యాన్స్ కు మరో కాంబినేషన్ దొరికినట్టే.
అయినా హిందీలో సరైన బ్రేక్ దొరక్క టాలీవుడ్ లోనే బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న జాన్వీ కపూర్ ఇక్కడ సరిగ్గా ఫోకస్ చేస్తే టాప్ లీగ్ లో సెటిల్ కావొచ్చు. అల్లు అర్జున్ రాకాలో కూడా తనుందనే లీక్ ఎప్పుడో వచ్చింది. ఇక పబ్లిసిటీ విషయానికి వస్తే ముంబైలో జరిగే పెద్ది ట్రైలర్ లాంచ్ లో జాన్వీ కపూర్ ఉంటుంది. భోపాల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ మటుకు శృతి హాసన్ తో సర్దుకోవాల్సి రావొచ్చు. హైదరాబాద్ వేడుకకు రావడం పక్కానే కానీ చెన్నై, బెంగళూరులో ఒకదాంట్లో పాల్గొనే అవకాశం ఉందట.
ఇంతకీ రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య డ్యూయెట్ లాంటిది లేకుండా బుచ్చిబాబు వీళ్ళ లవ్ ట్రాక్ ఎలా మేనేజ్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. పెద్ది విడుదల ఇంకో పద్దెనిమిది రోజుల్లో ఉండటంతో ఫ్యాన్స్ కౌంట్ డౌన్ ఎప్పుడెప్పుడాని ఎదురు చూడటంలోనే అయిపోయేలా ఉంది. ముఖ్యంగా ట్రైలర్ వచ్చాక హైప్ అమాంతం పెరిగిపోతుందనే నమ్మకం వాళ్లలో బలంగా ఉంది. చిరంజీవికి శ్రీదేవితో జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి ఎవర్ గ్రీన్ మూవీ ఉండగా ఆమె కూతురు జాన్వీకి ఇప్పుడు రామ్ చరణ్ తో అలాంటి క్లాసిక్ మెమరీ అందుకుంటుందో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
