Movie News

రాకా సంగీతానికి పెద్ద ఛాలెంజ్ ఉంది

అనిరుధ్ రవిచందర్ తర్వాత తమిళ దర్శకులు ఎక్కువగా జపిస్తున్న పేరు సాయి అభ్యంక్కర్. కుర్రాడు చాలా చిన్న వయసులోనే మ్యూజిక్ సెన్సేషన్ అయిపోయాడు. యూత్ క్రమంగా ఇతని పాటల పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. ప్రదీప్ రంగనాధన్ డ్యూడ్ కి తను ఇచ్చిన సంగీతం మెయిన్ పాజిటివ్స్ లో ఒకటిగా నిలిచింది. అలాని ఎవర్ గ్రీన్ ఇచ్చాడని కాదు కానీ ఈ మధ్య కాలంలో అంత అవుట్ ఫుట్ అనిరుధ్ లాంటోళ్ళు సైతం అందించలేదనేది వాస్తవం.

ఇప్పుడీ కుర్రాడి ఖాతాలో అల్లు అర్జున్ రాకా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడో సమస్య ఉంది. సాయి అభ్యంక్కర్ తో బెస్ట్ రాబట్టుకోవడం అంత సులభం కాదు. తాజాగా విడుదలైన సూర్య కరుప్పు / వీరభద్రుడులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు కొంత పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ పాటల దగ్గర దొరికిపోయాడు. హోరెత్తిపోయే సౌండ్స్ తో కొంచెం ఇబ్బంది పెట్టాడనే చెప్పాలి. లవ్ సాంగ్స్ లేకపోవడం తన పనితనానికి అడ్డం పడి ఉండొచ్చు.

దర్శకుడు అట్లీ ఇకపై రాకా కోసం ఓ రేంజ్ లో రాబట్టుకోవాలంటే సాయి అభ్యంక్కర్ ని పిండేయాలి. ఎందుకంటే పుష్పని మించిన ఆల్బమ్ ఇస్తేనే అల్లు అర్జున్ స్టేచర్ కి మ్యాచ్ అవుతుంది. అన్ని భాషల్లోనూ యునానిమస్ రెస్పాన్స్ తెచ్చుకోవాలి. ముఖ్యంగా హిందీ మీద బన్నీ ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. ఇది దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయట. రెండు పాటలు ఓకే అయ్యాయి కానీ మిగిలిన ట్యూన్స్ ఇంకా ఫైనల్ చేయలేదని తెలిసింది.

అనిరుధ్ స్థాయికి చేరుకోవడానికి సాయి వీలైనంత త్వరగా అదిరిపోయే ఆల్బమ్స్ ఇవ్వాలి. తన పేరు మరింతగా మారుమ్రోగిపోయేలా చేసుకోవాలి. రాకాని మించిన బెస్ట్ ఆఫర్ మరొకటి రాదు. ఎందుకంటే వందల కోట్లతో రూపొందుతున్న ఈ విజువల్ గ్రాండియర్ ని ఇంగ్లీష్ తో సహా విదేశీ భాషల్లోనూ డబ్బింగ్ చేసే అవకాశం ఉంది. తన వరకు బెస్ట్ ఇచ్చాడంటే మటుకు ప్యాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు పట్టేయొచ్చు. రాకా రిలీజ్ డేట్ ఇంకా నిర్ధారణ కాలేదు.

This post was last modified on May 15, 2026 10:34 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago