యువ కథానాయకుడు రామ్ పోతినేని తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు. తన కొత్త సినిమాను అనౌన్స్ చేస్తూ.. దీనికి తనే రచయిత-దర్శకుడు అని ప్రకటించాడు. ఈ చిత్రంలో రామ్ ‘వీర’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ముఖం చూపించకుండా బ్యాక్ లుక్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా ప్రి లుక్ పోస్టర్ డిజైన్ చేయించుకున్నాడు రామ్.
ఒక మాస్ హీరో ఇలా తనే సొంతంగా కథ రాసుకుని డైరెక్ట్ చేయడం అన్నది అరుదైన విషయమే. పైగా ఇదేమీ రెగ్యులర్ మాస్ మసాలా సినిమా కూడా కాదట. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు. మరి మాస్ సినిమాలకు పెట్టింది పేరైన రామ్.. స్వీయ దర్శకత్వంలో ఇలాంటి వైవిధ్యమైన సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. రామ్ సోదరుడైన కృష్ణ పోతినేని ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు. కాబట్టి ఇది అసలైన రామ్ ‘సొంత’ సినిమాగా చెప్పొచ్చు. ఐతే రామ్‌కు ఇప్పటికే ఒక హోం బేనర్ ఉంది. అదే.. స్రవంతి మూవీస్. అది రామ్ పెదనాన్న, లెజెండరీ ప్రొడ్యూసర్ రవికిషోర్‌ది.
ఆ బేనర్ మీద ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారాయన. రామ్‌తోనూ రెడీ, ఎందుకంటే ప్రేమంట, శివమ్, నేను శైలజ, రెడ్.. ఇలా చాలా సినిమాలు తీశారు రవికిషోర్. ఐతే ఆ బేనర్ ఉండగా.. రామ్ సొంతంగా వేరే బేనర్ పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
కొన్నేళ్లుగా రవికిషోర్ సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు. రామ్ కెరీర్లో కూడా జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఐతే బాబాయితో చెడి రామ్ సొంత బేనర్ మొదలుపెట్టాడా అనే చర్చ జరుగుతోంది.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణం జూదంలా మారిపోయిన నేపథ్యంలో నిర్మాతగా తాను ఇమడలేనన్న ఉద్దేశంతోనే రవికిషోర్ ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్నారని.. అందుకే రామ్ సొంతంగా బేనర్ పెట్టుకుని సినిమా చేయాల్సి వస్తోందని.. అంతకుమించి బాబాయితో గొడవలేమీ లేవని తెలుస్తోంది.
This post was last modified on May 15, 2026 4:37 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…