మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ టైటిల్ రివీల్ తో పాటు టీజర్ విడుదల చేయబోతున్నారు. వీడియోలో తారక్ లుక్, కాన్సెప్ట్ హైలైట్ చేస్తారు తప్పించి కీలకమైన విజువల్స్ రివీల్ చేయరు. సలార్ కు పాటించిన స్ట్రాటజీనే నీల్ మళ్ళీ రిపీట్ చేయబోతున్నాడని సమాచారం. డైనోసర్ అనే పదంతో ఎలా అయితే హైప్ అమాంతం పెంచాడో ఈసారి అంతకు మించిన లైన్స్ ఎంచుకున్నాడట.
ముందు రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇది లాంచ్ కానుంది. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఎలాగూ జూనియర్ బర్త్ డే కాబట్టి ఈ రూపంలో సంబరాలు చేయబోతున్నారు. అయితే హైప్ పరంగా చాలా బాగుంది కానీ అంతే మోతాదులో బరువు కూడా ఉన్న విషయాన్ని ఎన్టీఆర్ నీల్ మర్చిపోకూడదు. ఎందుకంటే వార్ 2 గాయం ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. అది మానాలంటే వాళ్లకు కనిపిస్తున్న మందు ప్రశాంత్ నీల్ ఒక్కటే.
సో ఎక్స్ ట్రాడినరి అనిపించేయాలి. అంతర్గత సమాచారం మేరకు విజువల్స్ చాలా బాగున్నాయట. ఇతర పాత్రలను రివీల్ చేయకుండా కేవలం జూనియర్ ఎన్టీఆర్ నే ఫోకస్ చేసేలా నీల్ కట్ చేయించాడని అంటున్నారు. కాకపోతే మరీ విపరీతంగా ఊహించేసుకుంటే కాదు కానీ తాను ఏ స్థాయిలో యంగ్ టైగర్ ని ఆవిష్కరించిబోతున్నాడో ప్రశాంత్ నీల్ ఈ శాంపిల్ రూపంలో చూపించబోతున్నాడని తెలిసింది.
ఇక్కడ ఇంకో చిక్కు ఉంది. ముందు రోజు పెద్ది ట్రైలర్ వచ్చి ఉంటుంది. అది కనక క్లిక్ అయితే సోషల్ మీడియా దాని హ్యాంగోవర్ లో మునుగుతుంది. దాన్ని డామినేట్ చేసేలా ఉందని నీల్ అనిపించుకోవాలి. సగం షూటింగ్ కూడా అవ్వని ఎన్టీఆర్ సినిమాతో పెద్దిని పోల్చడం కరెక్ట్ కాదు కానీ ఆన్ లైన్ జనాలకు ఆ పట్టింపులు ఏమీ ఉండవు. కంపారిజన్లతో వాయించేస్తారు. సో ఆ రెండు రోజులు ఎక్స్, ఇన్స్ టా, ఫేస్ బుక్ తదితర మాధ్యమాల్లో మంచి హంగామా చూడొచ్చు.
This post was last modified on May 15, 2026 2:58 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…