Political News

పవన్ సర్జరీ వెనుక పెద్ద కారణమే ఉంది

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గ‌త నెల‌లో హ‌ఠాత్తుగా అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం, ఆయ‌న‌కు అత్య‌వ‌స‌రంగా శ‌స్త్ర చికిత్స జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశం అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అనారోగ్యంపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. అంద‌రూ శ‌స్త్ర చికిత్స అని రిపోర్ట్ చేశారే కానీ.. అస‌లు స‌మ‌స్య ఏంటి, దేనికి స‌ర్జ‌రీ జ‌రిగింద‌నే విష‌యం మాత్రం ఎవ్వ‌రూ చెప్ప‌లేదు.

త‌ర్వాత ఆస్త‌మాకు శ‌స్త్ర చిక‌త్స జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి కానీ.. వాటి మీదా స్ప‌ష్ట‌త లేదు. ఐతే ఈ విష‌యంపై ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా స్పందించారు. జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో జ‌రిగిన స‌మావేశంలో త‌న అనారోగ్యం, స‌ర్జ‌రీ గురించి ప‌వ‌న్ స్పందించాడు.

త‌న ఆరోగ్యం గురించి అంద‌రూ అడుగుతున్నార‌ని.. అస‌లేమైందో చెబుతా అంటూ త‌న‌కున్న స‌మ‌స్య‌ల‌న్నింటినీ చెప్పుకొచ్చాడు ప‌వ‌న్. క‌రోనా స‌మ‌యంలో త‌న‌కూ కొవిడ్ వ‌చ్చింద‌ని.. దాని వ‌ల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చి స‌మ‌స్య త‌లెత్తింద‌ని ప‌వ‌న్ వెల్ల‌డించాడు. ఇక ఎన్నిక‌ల కోసం బాగా తిర‌గ‌డం వ‌ల్ల దుమ్ము అంతా లోప‌లికి వెళ్లి సైన‌స్ స‌మ‌స్య త‌లెత్తింద‌ని.. ఆ దుమ్మంతా గ‌ట్టిప‌డి రాయిలాగా మారింద‌ని ప‌వ‌న్ తెలిపాడు.

దీని వ‌ల్ల త‌న‌కు ఇటీవ‌ల దూరంలో ఉన్న వ‌స్తువుల‌ను చూడ‌లేని ప‌రిస్థితి త‌లెత్తింద‌ని.. అప్పుడు తీవ్ర‌త అర్థ‌మై భీమ‌వ‌రంలో ఒక ప్రోగ్రాంలో పాల్గొనాల్సిన వాడిని.. అత్య‌వ‌స‌రంగా హైద‌రాబాద్‌కు వెళ్లి అన్ని ప‌రీక్షలూ చేయించుకున్నాన‌ని.. అప్పుడు చాలా విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని ప‌వ‌న్ వెల్లడించాడు.

రెండు భుజాల మ‌ధ్య చిన్న చీల‌క వ‌చ్చిన‌ట్లు వైద్యులు గుర్తించి ఇది ఎలా జ‌రిగింద‌ని అడిగితే.. త‌న అభిమానులు ప్రేమ‌తో భుజాలు లాగేస్తుంటార‌ని.. షేక్ హ్యాండ్ ఇచ్చిన‌పుడు అంత ఈజీగా వ‌ద‌ల‌ర‌ని.. ఇటు అటు ఉన్న వాళ్లు లాగిన‌పుడు ఇలా జ‌రిగి ఉండొచ్చ‌ని వైద్యుల‌కు చెప్పినట్లు ప‌వ‌న్ తెలిపాడు.

త‌న‌కు వెన్నుపూస‌లోనూ స‌మ‌స్య ఉంద‌ని.. ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ.. గ‌తంలో స్పోర్ట్స్ కోసం ట్రైనింగ్ తీసుకుని ఉండ‌డంతో ఎంత నొప్పినైనా త‌న శ‌రీరం భ‌రిస్తుంద‌ని.. నొప్పిని గుర్తించ‌డం కూడా క‌ష్ట‌మ‌వుతుంద‌ని చెప్పాడు ప‌వ‌న్. ఐతే అభిమానుల వ‌ల్ల గాయాలైనా..మందు వేసేది కూడా వాళ్ల ప్రేమే అంటూ ఆడిటోరియాన్ని హోరెత్తించాడు ప‌వ‌న్. త‌న కోసం ప్రార్థించిన అంద‌రికీ ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు.

This post was last modified on May 15, 2026 8:59 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago