గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సింపుల్ మెజారిటీ సాధించకపోవడంతో విజయ్ సీఎం పదవి చేపట్టడంలో ఇబ్బందులు తప్పలేదు.
ఐతే నాలుగైదు రోజుల డ్రామా తర్వాత ఆదివారం ప్రమాణ స్వీకారం చేశాడు మరి అసెంబ్లీలో బుధవారం జరిగే బలపరీక్షలో విజయ్ నెగ్గగలడా లేదా అన్న సందేహాలు నెలకొనగా.. అనుకున్న దాని కంటే ఎక్కువగా, 144 మంది సభ్యుల మద్దతు లభించడం విశేషం.
అన్నాడీఎంకే పార్టీ రెబల్ నేత తన వెంట నడిచిన ఎమ్మెల్యేలతో తన ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడంతో విజయ్‌కి ఏ ఇబ్బందీ లేకపోయింది. కానీ దీని వెనుక వేరే రాజకీయం ఉందంటూ పెద్ద డిస్కషన్ నడుస్తోందిప్పుడు.
తనకు మద్దతుగా నిలవాలంటూ విజయ్.. టీవీ షణ్ముగం ఇంటికి వెళ్లి కోరిన సమయంలో ఆయన ఇంట్లో ఒక కొత్త సోఫా ఉంది.
అది విజయ్ రావడానికి ముందే డెలివరీ కావడం విశేషం. సంబంధిత విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది జస్ట్ కుషన్ ఉన్న సోఫా కాదని, అందులో భారీ మొత్తంలో డబ్బు ఉందని ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమా చూసిన వాళ్లకు ఈ సోఫా పాలిటిక్స్ గురించి బాగానే అవగాహన ఉంటుంది.
ఆ చిత్రంలో అల్లు అర్జున్ ఇలాగే సోఫా ద్వారా రాజకీయ నాయకులకు డబ్బులు పంపించి చక్రం తిప్పుతాడు. ఆ సినిమా నుంచి విజయ్ పార్టీ స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఈ విషయం అసెంబ్లీ వరకు వెళ్లడం, అక్కడ కూడా పుష్ప ప్రస్తావన రావడం విశేషం.
ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో సోఫా సీన్‌ను ఇప్పుడు అధికార పార్టీ రీక్రియేట్ చేసిందని.. కొత్త రాజకీయం చేస్తాం, మార్పు తీసుకొస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇలాగేనా రాజకీయం చేసేది అని ఉదయనిధి ప్రశ్నించాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడి ఇంటికి అధికార పార్టీ అధినేత వెళ్తాడు.. ఆయన వెళ్లడానికి ముందు కొత్త సోఫా ఆ ఇంటికి చేరుతుంది అంటూ ఉదయనిధి కౌంటర్ వేశాడు.
This post was last modified on May 13, 2026 11:21 pm
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…