జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్ కు ఊపిరి పోయాల్సిన బాధ్యత రామ్ చరణ్, బుచ్చిబాబు మీద ఉంది. అందుకే ఏబిసి తేడా లేకుండా అన్ని సెంటర్ల నుంచి విపరీతమైన డిమాండ్ నెలకొంది. పాజిటివ్ టాక్ వస్తే చాలు సునామిలాగా కలెక్షన్లు విరుచుకుపడతాయి. అందులోనూ మెగా ఫ్యాన్స్ ఆశలు దీని మీద మాములుగా లేవు. మగధీర, రంగస్థలంని మించిన పెర్ఫార్మన్స్,రన్ ఆశిస్తున్నారు.
ఇక టికెట్ రేట్లకు సంబంధించిన నిర్మాతలు అనుమతులు తెచ్చుకునే పనిని ఆల్రెడీ మొదలుపెట్టారని సమాచారం. ముందు రోజు అంటే జూన్ 3 రాత్రి వేసే ప్రీమియర్లకు 600 రూపాయలు ఫ్లాట్ రేట్ ఫిక్స్ చేసి అటుపై పది రోజుల వరకు ఒక్కో టికెట్ మీద 100 రూపాయల పెంపు అడిగే ప్రతిపాదన సిద్ధం చేశారట. నిజానికి గ్రౌండ్ లెవెల్ లో పెద్దికున్న హైప్ ఓజి, పుష్పతో పోల్చవచ్చు. రిలీజ్ నాటికి మానియా ఆ స్థాయికి చేరిపోవడం ఖాయమే.
అలాంటప్పుడు బెనిఫిట్ షోకు వెయ్యి రూపాయలు పెట్టినా తీసుకునేలా ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఆరు వందలు చాలా మంచి ధర. సాధారణ కోణంలో ఎక్కువే అనిపించినా పెద్ది మీద ఉన్న బజ్ తో పోలిస్తే సబబుగానే అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇప్పుడప్పుడే రాకపోవచ్చు. జూన్ 25 నుంచి ఏ రోజైనా జిఓ వచ్చే అవకాశాలున్నాయి. ఇక అసలు సస్పెన్స్ తెలంగాణ వైపు ఉంది. సింగల్ స్క్రీన్ వివాదం అక్కడ రోజురోజుకి ముదురుతున్న సంగతి తెలిసిందే.
గవర్నమెంట్ జిఓ ఇచ్చినా సరే పర్సెంటేజ్ ఇచ్చే పనైతే మేము పెంపుని ఉపయోగించకోమని నైజామ్ ఎగ్జిబిటర్లు చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి నిర్మాతల మండలి నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇది పరిష్కారం అయితే తప్ప హైదరాబాద్ తో సహా తెలంగాణ సింగల్ స్క్రీన్లలో పెద్ది షోలు పడతాయా లేదా నిర్ణయమవుతుంది. విడుదల ఇంకో ఇరవై రోజుల్లో ఉంది. ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్ లో సాంగ్ ఈవెంట్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పబ్లిసిటీ వేగవంతం చేయబోతున్నారు.
This post was last modified on May 14, 2026 9:44 am
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…