ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని కనక సింగల్ స్క్రీన్లలో వేయనివ్వని పరిస్థితి వస్తే ముందు చిరంజీవి దగ్గరికి వెళ్తామని, అలాగే రామ్ చరణ్ ని కలిసి విన్నవిస్తామని అనేశారు. నిజానికి నేను ఇండస్ట్రీ పెద్దని కాదని మెగాస్టార్ ఎప్పుడో చెప్పారు. ఏదైనా అవసరం ఉంటే చొరవ తీసుకుంటారు తప్పించి తానుగా అన్ని వ్యవహారాల్లో కలగగేసుకునే ధోరణి ఎప్పుడూ ప్రదర్శించలేదు.
ఇప్పుడు వచ్చింది చాలా సున్నితమైన సమస్య. అందరూ చిరంజీవికి కావాల్సిన వాళ్ళే. దిల్ రాజుని పిలిపించి ఇదేంటి ఇలా చేస్తున్నారని నిలదీయలేరు. ఎందుకంటే ఎగ్జిబిటర్లందరూ ముందుకొచ్చి మా గోడు వినండి మహాప్రభో అంటూ తమ వెర్షన్ వినిపిస్తారు. లేదూ ఇటు మైత్రి, సితార వాళ్లకు సర్దిచెబుదామంటే కొడుకు సినిమా కాబట్టి ఇలా మధ్యవర్తిత్వం చేస్తున్నారనే కామెంట్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ట్రేడ్ కు సంబంధించిన వివాదాలను నటులు పరిష్కరించలేరు.
పైగా చిరంజీవి నిర్మాత కాదు, దర్శకుడు అంతకన్నా కాదు. చేతిలో అల్లు అరవింద్ లాగా థియేటర్లు లేవు. అలాంటప్పుడు ఈ రంగం మీద పట్టు ఉంటుందని చెప్పడానికి లేదు. ఏదో మాట సాయం వరకు ఓకే కానీ ఒకరికి ఇలాగే చేయమని చెప్పే అనవసర చొరవ తీసుకోరనే అనిపిస్తుంది. పెద్ది ఎంత తన బిడ్డ సినిమా అయినప్పటికీ న్యూట్రల్ గా ఆలోచిస్తే ఎవరివైపు నిలబడలేని పరిస్థితి కనిపిస్తుంది. సో మధ్యేమార్గంగా తమ్మారెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా కలగజేసుకుంటారేమో చూడాలి.
ఎవరు రంగంలోకి దిగినా దిగకపోయినా ముందైతే ఇది సాల్వ్ కావాలి. ఎవరో ఒకరు సొల్యూషన్ కోసం అడుగులు వేయాలి. ఇప్పటికైతే మేమంటే మేము రైట్ అనే వాదన ఇరు వర్గాల్లోనూ కనిపిస్తోంది. ఒకవేళ చిరంజీవి కనక పెద్దగా ముందుకు వచ్చారంటే పెద్దికి మంచిదే. కానీ అలా జరుగుతుందా అంటే డౌటే. రాబోయే వారం రోజులు చాలా కీలకం కాబోతున్నాయి. సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సోషల్ మీడియా మూవీ లవర్స్ కి మంచి కంటెంట్ అయితే దొరికేసింది.
This post was last modified on May 13, 2026 9:36 pm
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…