Movie News

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా చేస్తున్నాడు కానీ హిట్లు పడకపోవడంతో పాటు సత్య లాంటి కమెడియన్లు దూసుకురావడం తన కెరీర్ మీద ప్రభావం చూపించింది. దానికి తోడు అప్పుడప్పుడు పలు విషయాల మీద ఎక్స్ ట్రీమ్ గా స్పందించడం అవకాశాలను ఎఫెక్ట్ చేసిందని సన్నిహితులు అంటుంటారు. సరే ఇప్పుడీయన టాపిక్ ఎందుకు వచ్చిందో చూద్దాం.

ఎక్స్ వేదికగా రాహుల్ చేసిన మెసేజ్ లో థియేటర్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయో ప్రతి ఒక్కరు విశ్లేషించుకోవాలని, క్వాలిటీ లేకుండా కంటెంట్ ఇచ్చి వేరే సాకులు చెప్పడం వల్ల ఎలాంటి లాభం లేదని అన్నాడు. ఎండలు, ఐపీఎల్, టికెట్ రేట్లు లాంటి ఎన్నో అడ్డంకులు దాటుకుని ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే బిగ్ స్క్రీన్ మీద ఖచ్చితంగా చూడాలనిపించే కంటెంట్ ఇవ్వాలని చెప్పాడు. అది లేకుండా ఏం చేసినా పైసా ప్రయోజనం ఉండదని అందరిని ఉద్దేశించి చురకలు వేశారు.

రాహుల్ రామకృష్ణ చెప్పిందాంట్లో నిజముంది. కొన్ని వారాలుగా టాలీవుడ్ థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయా యూనిట్లు హైదరాబాద్ లో రెండు మూడు మల్టీప్లెక్సులు ఫుల్ అవ్వడం సోషల్ మీడియాలో చూపించి ఏపీ తెలంగాణ మొత్తం అలాగే ఉందని తమను తాము మోసం చేసుకోవడం తప్ప క్షేత్ర స్థాయిలో పరిస్థితి దానికి వ్యతిరేకంగా ఉంది. రిలీజ్ రోజే మొదటి షోలు క్యాన్సిల్ అయ్యేంత దారుణంగా కొన్ని సినిమాలు కనీసం పబ్లిసిటీ ఖర్చులు తేవడం లేదు.

ఐపీఎల్ ఎండలు మనకు కొత్త కాదు. రెండు దశాబ్దాలుగా ఉన్నాయి. మరి ప్రతిసారి థియేటర్లు బోసిపోలేదుగా. ఈ ఏడాది మాత్రమే ఎందుకు ఇలా జరిగిందంటే కనీస స్థాయిలో ఆడియన్స్ మెప్పించేలా సినిమాలు లేకపోవడమే. జనాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుని సీరియల్ టైపు కథలు, అవసరం లేని వయొలెన్స్ ఎలివేషన్లతో విసిగించేస్తున్నారు. అసలు పబ్లిసిటీ మీద పెట్టిన శ్రద్ధ స్క్రిప్ట్ మీద పెడితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కానీ వినేదెవరు పట్టించుకునేదెవరు.

This post was last modified on May 12, 2026 12:03 pm

Share

Recent Posts

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

14 minutes ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

19 minutes ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

25 minutes ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

3 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

4 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

4 hours ago