Movie News

నితిన్ మూడు నిర్ణయాలు సరైనవే

వరస డిజాస్టర్ల దెబ్బకు కొంత బ్రేక్ తీసుకున్న నితిన్ మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెడుతున్నాడు. డెబ్యూ దర్శకులను నమ్మి ఇటీవలే కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే గతంలో వదులుకున్న ప్రాజెక్టుల విషయాలు ఇప్పుడు మరోసారి చర్చలోకి వస్తున్నాయి. నిన్న సందీప్ కిషన్ ‘పవర్ పేట’ టీజర్ వచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య ఇది రాసుకున్నది నితిన్ కోసమే. అయితే ఆయన డైరెక్ట్ చేసిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఫ్లాప్ అయ్యాక అడుగులు ముందుకు పడలేదు.

ఆనంద్ దేవరకొండ చేసిన ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ తొలుత నితిన్ దగ్గరికే వెళ్ళింది. సితార సంస్థ కన్నా ముందు స్వంత బ్యానర్ లో తెరకెక్కించేందుకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. దిల్ రాజు నిర్మాతగా వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అంతా ఓకే అనుకున్న తర్వాత తమ్ముడు ఫలితం ఈ కాంబోని ఆపేసింది. ఊహించని విధంగా నితిన్ ప్లేస్ లో దేవీశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కావడం అసలు ట్విస్ట్.

పైన చెప్పిన మూడు సబ్జెక్టులు విశ్లేషించుకుంటే నితిన్ మూడు నిర్ణయాలు సరైనవే అనిపిస్తుంది. పవర్ పేటలో ఉండే ఓవర్ మాస్ తనకు అంతగా సూట్ కాదు. ప్రస్థానం నుంచి రాయన్ దాకా సందీప్ కిషన్ ఇలాంటి నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు చేశాడు కాబట్టి ఈజీగా నెట్టుకొస్తాడు ఇక ఎపిక్ లో కాలేజీ కుర్రాడిగా ఆనంద్ దేవరకొండ సరిపోతాడు కానీ నలభై వయసు దాటిన నితిన్ తో ఇప్పుడు లిప్ లాక్స్ పెట్టడం అంతగా సెట్ కాదు. అది కూడా యుకె బ్యాక్ డ్రాప్ లో.

ఇక ఎల్లమ్మలో దేవి గెటప్ చూశాక కొత్తవాళ్ళైతేనే ఇలాంటి క్యారెక్టర్స్ పండుతాయనే అభిప్రాయానికి బలం చేకూరింది. కారణాలు ఏమైనా, నితిన్ వీటిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చినా అంతా మన మంచికే అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. కొంచెం లేట్ అయినా పర్లేదు సరైన హిట్ రావాలన్న సంకల్పంతో నితిన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బడ్జెట్ ఇష్యూస్ కారణంగా విఐ ఆనంద్ తో ప్లాన్ చేసిన ఫాంటసీ మూవీ కొంత ఆలస్యంగా మొదలుపెడతారని టాక్.

This post was last modified on May 8, 2026 12:41 pm

Share

Recent Posts

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

38 seconds ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

30 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

56 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

2 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

2 hours ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago